Telangana: నాలుగు తరాల బంధువుల ఆత్మీయ కలయిక.. ఆటపాటలతో పిల్లలు, పెద్దలు సందడే సందడి..

బంధాలు, బంధుత్వాలకు విలువ లేకుండా పోతున్న నేటి సమాజంలో ఓ కుటుంబం వారు తమ నాలుగు తరాల బంధువులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని అందరు ఒకే చోట కలిసి ఆనందంగా గడిపారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం గ్రామానికి చెందిన నారపొంగు కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం కన్నుల పండుగగా జరిగింది. ఏదులాపురం చెందిన నారపొంగు బ్రహ్మం, నారపొంగు యాకుబ్, నారపొంగు శ్రీను, నారపొంగు రమేష్ ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Telangana: నాలుగు తరాల బంధువుల ఆత్మీయ కలయిక.. ఆటపాటలతో పిల్లలు, పెద్దలు సందడే సందడి..
Four Generations reUnit
Follow us
N Narayana Rao

| Edited By: Surya Kala

Updated on: May 30, 2024 | 12:33 PM

నేటి ఆధునిక సమాజంలో ఎవరికి వారు యమునా తీరుల ఉరుకులు, పరుగులతో జీవనం ఉద్యోగాల బాధ్యతలు, వ్యాపారాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. సమాజంలో అన్నదమ్ములు, బంధువులకు సమయం కేటాయించే సందర్భాలు చాలా తక్కువ అవుతున్నాయి. ఎవరికి వారు వారి కుటుంబానికే పరిమితం అవుతున్నారు. ఇలాంటి రోజుల్లో ఓ కుటుంబానికి చెందిన నాలుగు తరాల వారు కలసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం విశేషం. నాలుగు తరాలకు చెందిన కుటుంబ సభ్యులు అందరూ ఒకే వేదికపై చేరి సందడి చేశారు. ఇది ఎక్కడ అంటారా ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఏదులపురం పరిధిలో ఓ మామిడి తోటలో జరిగింది.

బంధాలు, బంధుత్వాలకు విలువ లేకుండా పోతున్న నేటి సమాజంలో ఓ కుటుంబం వారు తమ నాలుగు తరాల బంధువులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని అందరు ఒకే చోట కలిసి ఆనందంగా గడిపారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం గ్రామానికి చెందిన నారపొంగు కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం కన్నుల పండుగగా జరిగింది. ఏదులాపురం చెందిన నారపొంగు బ్రహ్మం, నారపొంగు యాకుబ్, నారపొంగు శ్రీను, నారపొంగు రమేష్ ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా అక్క, చెల్లెలు, బావలు, వారి కుమారులు, అల్లుళ్ళు, బిడ్డలు ఇలా 4 తరాలను , చెందిన కుటుంబ సభ్యులను 30 సంవత్సరాల తర్వాత అందరూ ఒక్క చోట చేరుకొని ఒక పండగ వాతావరణం లాగా వేడుకలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులంతా ఒకే చోట కలుసుకోవడంతో ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఎంతో సందడిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు.

ఇవి కూడా చదవండి

కుటుంబ సభ్యుల ఆత్మీయ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన హైదరాబాద్, సూర్యాపేట, మణుగూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వీర్లపాడు, జగ్గయ్యపేట నుంచి కుటుంబ సభ్యులు హాజరయ్యి వేడుకలలో సంతోషంగా పాల్గొని తమ గత జ్ఞాపకాలను నెమర వేసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు పెద్దలు అందరూ కలిసి ఉత్సాహంగా కుర్చీలాట, డాన్స్ ప్రోగ్రాం, కోకో, కబడ్డీ ఆటలను ఆడారు. అక్కడకు వచ్చిన కొన్ని జంటల పెళ్లిరోజును పురస్కరించుకొని కేక్ కటింగ్ చేసి సంతోషంగా పెళ్లి రోజు చేసుకున్నారు. నారపొంగు వృక్షానికి కారకులైన వారి కుటుంబం పెద్దలను శాలువలతో ఘనంగా సత్కరించుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..