Viral Video: యముడు లీవ్‌లో ఉన్నట్లు ఉన్నాడు.. బైక్‌పై యువకుడు డేంజర్ స్టంట్‌.. వీడియో వైరల్‌

తాము చేస్తున్న స్టంట్ చాలా ప్రమాదకరమైనది.. ఏ మాత్రం తేడా వస్తే మరణించాల్సిందే అని తెలిసినా ఎక్కడా తగ్గడం లేదు. ఆడమగ అనే తేడా లేకుండా తమ చేష్టలతో .. రకరకాల స్టంట్స్ తో వాహనాలతో రోడ్లపైకి వెళ్తున్నారు. ప్రస్తుతం అటువంటి ప్రమాదకరమైన స్టంట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కదులుతున్న బైక్‌పై కూర్చున్న ఓ యువకుడు తర్వాత బైక్ మీద నిల్చుకుని నెమ్మదిగా రెండు చేతులను వదిలి బైక్‌పై నిల్చుని బైక్ ని నడుపుతున్నట్లు వీడియోలో చూడవచ్చు.

Viral Video: యముడు లీవ్‌లో ఉన్నట్లు ఉన్నాడు.. బైక్‌పై యువకుడు డేంజర్ స్టంట్‌.. వీడియో వైరల్‌
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: May 30, 2024 | 9:58 AM

కదులుతున్న వాహనాలపై ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం ప్రస్తుతం యువతకు హాబీగా మారింది. ఎక్కడ చూసినా రీల్స్ , వీడియోలను రకరకాల డేంజర్ స్టంట్స్ చేస్తున్న వారు కనిపిస్తూనే ఉన్నారు. కదులుతున్న వాహనాలపై నుంచి పడిపోతే ఏమవుతుందో కూడా ఆలోచించడం లేదు. తాము చేస్తున్న స్టంట్ చాలా ప్రమాదకరమైనది.. ఏ మాత్రం తేడా వస్తే మరణించాల్సిందే అని తెలిసినా ఎక్కడా తగ్గడం లేదు. ఆడమగ అనే తేడా లేకుండా తమ చేష్టలతో .. రకరకాల స్టంట్స్ తో వాహనాలతో రోడ్లపైకి వెళ్తున్నారు. ప్రస్తుతం అటువంటి ప్రమాదకరమైన స్టంట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కదులుతున్న బైక్‌పై కూర్చున్న ఓ యువకుడు తర్వాత బైక్ మీద నిల్చుకుని నెమ్మదిగా రెండు చేతులను వదిలి బైక్‌పై నిల్చుని బైక్ ని నడుపుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో ఆ బైక్ కి మందు ఒక బస్సు కూడా వెళుతుంది. అయినప్పటికీ ఆ యువకుడు అస్సలు భయపడలేదు. అతను నిలబడి బండిని నడుపుతూ బస్సును దాటాడు. తర్వాత హాయిగా బైక్‌పై కూర్చుని ‘జిగ్ జాగ్ కట్’ లో డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతున్నాడు. ఆ యువకుడి డ్రైవింగ్ తీరు చూసిన ప్రజలు షాక్ తిన్నారు. ఈ ఘటన బీహార్‌లోని సమస్తిపూర్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

ఈ బైక్ స్టంట్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @ChapraZila అనే ఐడితో షేర్ చేశారు. యమధర్మ రాజు ఇప్పుడు నిద్రపోతున్నాడు.. అందుకే ఈ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే సమస్తిపూర్ పోలీసులు ఈ వీడియోను చూస్తున్నారా?’అనే క్యాప్షన్ జత చేశారు. కేవలం 28 సెకన్ల ఈ వీడియో ఇప్పటివరకు 90 వేలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. , వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసి వివిధ రకాల కామెంట్స్ చేశారు.

ఇలాంటి స్టంట్స్ చేస్తూ ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు అని ఒకరు కామెంట్ చేయగా.. సమస్తిపూర్ పోలీసులు కూడా ఈ వీడియో గురించి మాట్లాడుతూ.. యముడు నిద్రపోయి ఉండవచ్చు.. కానీ సమస్తిపూర్ పోలీసులు 24*7 మేల్కొనే ఉంటారు.. అని చెప్పారు. మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించి రీల్స్‌ను తయారు చేసిన ఆరోపణలపై మోటారు వాహనాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద సమస్తిపూర్ పోలీసులు ఆ యువకుడికి చలనాలు జారీ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..