Tamilnadu: గాయపడిన తల్లిని ఆస్పత్రికి భుజాల మీద తీసుకుని వెళ్ళిన యువతి.. హాస్పటల్ నిర్వాకంపై సిబ్బందికి మెమో జారీ..
కాలికి గాయమై నడవలేని స్థితిలో ఉన్న తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి స్ట్రెచర్ ఇవ్వమని ఆస్పత్రి సిబ్బందిని కోరింది. అయితే సిబ్బంది స్ట్రెచర్, వీల్ చైర్ ఇవ్వకపోవడంతో వలర్మతి తన తల్లిని వార్డుకు భుజాల మీదకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనను అక్కడ ఉన్న ఓ వ్యక్తి తన సెల్ లో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సోర్ణకు తగిన చికిత్స ఇచ్చి తర్వాత ఇంటికి పంపించారు.
తమిళనాడు ఈరోడ్‌లోని జిల్లా హెడ్‌క్వార్టర్స్ హాస్పిటల్‌లో గాయపడిన తల్లిని తన చేతులపై మోస్తున్న యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆస్పత్రి నిర్వహణ గురించి ఆరోగ్య సేవల జాయింట్ డైరెక్టర్ అంబికా షణ్ముగం బుధవారం( మే 29, 2024) విచారణ చేశారు. సోమవారం ( మే 27) పెరియవలసుకు చెందిన పి.సోర్ణ (80)ను వాహనం ఢీకొనడంతో ఆమె కాలికి గాయమైంది. గాయపడిన వృద్ధురాలిని ఆమె కుమార్తె వలర్మతి తన తల్లిని చికిత్స నిమిత్తం ఆటోలో ఈరోడ్ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకుని వెళ్ళింది. ఆ సమయంలో వృద్ధురాలిని చూసిన వైద్యులు ప్రమాద, అత్యవసర విభాగానికి తీసుకెళ్లాలని సూచించారు. ఆ సమయంలో కాలికి గాయమై నడవలేని స్థితిలో ఉన్న తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి స్ట్రెచర్ ఇవ్వమని ఆస్పత్రి సిబ్బందిని కోరింది. అయితే సిబ్బంది స్ట్రెచర్, వీల్ చైర్ ఇవ్వకపోవడంతో వలర్మతి తన తల్లిని వార్డుకు భుజాల మీదకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనను అక్కడ ఉన్న ఓ వ్యక్తి తన సెల్ లో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సోర్ణకు తగిన చికిత్స ఇచ్చి తర్వాత ఇంటికి పంపించారు.
అయితే ఈ ఘటనకు సంబధించిన వీడియో వైరల్ కావడంతో స్థానిక ఎమ్మెల్యే అంబికా షణ్ముగం వివరణ కోరుతూ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేష్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ శశిరేఖకు మెమోలు జారీ చేశారు. బుధవారం ఆసుపత్రి సిబ్బందితో పాటు వలర్మతితో విచారణ చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలోకి వచ్చినప్పటి నుంచి వలర్మతి కలుసుకున్న సిబ్బంది గురించి, ప్రతిస్పందన, చికిత్స అందించిన విధానం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మెమోలను అందుకు సమాధానం ఇవ్వాలని కోరారు. విచారణ జరుగుతోందని వారి వివరణ ఆధారంగా చర్య తీసుకుంటామని చెప్పారు. అంతేకాదు ఈ ఘటన అనంతరం ఆసుపత్రి ప్రవేశద్వారం వద్ద రోగులకు వీల్‌ఛైర్లు, స్ట్రెచర్లను అందుబాటులో ఉంచారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..