Amrit in Ayurveda: ఆయుర్వేదంలో ఈ ఆహారాలు అమృతమే.. వాత, పిత్త, కఫ దోషాలను తొలగిస్తాయి..

మానవ శరీరం ప్రకృతిలో దొరికే మూలకాల నిర్మాణం. కనుక ఎ సీజన్ లో దొరికే కూరగాయలు, పండ్లను ప్రకృతి సహజ సిద్ధమైన కొన్ని రకాల వస్తువులను తినడం వలన ఆరోగ్యంగా ఉంటామని ఆయుర్వేదం చెబుతోంది. అంతేకాదు కొన్ని రకాల వస్తువులు, ఆహారం ఆయుర్వేదంలో 'అమృతం'గా పరిగణిస్తున్నారు. ప్రాచీన కాలం నుంచి భారతీయులు వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాచీన భారతీయ వైద్య విధానంలో అనేక ఆహారాలు అమృతాలుగా పరిగణించబడుతున్నాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఆ ఆహారాలు శరీరంలోని మూడు దోషాలను (వాత, పిత్త, కఫ) తొలగించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక వీటిని మనం నిత్యం ఉపయోగించడం వలన కలిగే ప్రయోజలు ఆ వస్తువులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Surya Kala

|

Updated on: May 30, 2024 | 11:12 AM

ప్రాచీన కాలం నుండి భారతీయ సమాజంలో ఆయుర్వేద వైద్యం వాడుకలో ఉంది. ఈ ప్రాచీన భారతీయ వైద్య విధానంలో అనేక ఆహారాలు అమృతాలుగా పరిగణించబడుతున్నాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కొన్ని ఆహారాలు శరీరంలోని మూడు దోషాలను (వాత, పిత్త, కఫ) తొలగించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

1 / 7
ఆయుర్వేదంలో పసుపును 'గోల్డెన్ స్పైస్'గా పరిగణిస్తారు. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో పసుపుకి అత్యంత  ప్రాముఖ్యత ఉంది.

2 / 7
ఆయుర్వేదంలో నెయ్యిని ద్రవ బంగారంగా పరిగణిస్తారు. నెయ్యి మంచి శక్తి వనరుగా ఉండటమే కాదు అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. నెయ్యికి ప్రతి భారతీయుల వంట గదిలో ఒక ప్రత్యేకత స్థానం ఉంది.

3 / 7
ఉసిరి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండు. రోగనిరోధక శక్తిని పెంచడానికి , చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉసిరికి మించింది లేదు. అంతేకాదు బహుళ ప్రయోజనాలను కలిగి ఉన్న  ఉసిరికి పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో విశిష్ట స్థానం ఉంది.

4 / 7
మన దేశంలో సిద్ధ, ఆయుర్వేద వైద్యంలో తేనె ప్రధాన ఔషదంగా ఉపయోగపడుతోంది. తేనెలో బహుళ భౌతిక ప్రయోజనాలున్నాయి. తేనెను ఆయుర్వేదంలో అనేక ఆయుర్వేద ఔషధాల తయారీలో  ఉపయోగిస్తారు.

5 / 7
తులసి ఆకులను ఆయుర్వేదంలో అమృతం అని కూడా పూజిస్తారు. వాత, కఫ దోషాల నుండి శరీరం నుండి బయటపడటానికి సహాయపడుతుంది. చాలా మంది తులసి ఆకులను దాని ఔషధ గుణాల కోసం క్రమం తప్పకుండా తింటారు.

6 / 7
ఆయుర్వేదంలో అల్లానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దీని శోథ నిరోధక లక్షణాలతో పాటు, అల్లం నొప్పి నివారణకు కూడా మంచి సహాయకారి. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా ఇది పాత్ర పోషిస్తుంది.

7 / 7
Follow us