- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Season 7 Fame Subhashree Rayaguru Stunning Photos Goes Viral telugu cinema news
Subhashree Rayaguru: అయ్యా బాబోయ్.. ఈ రేంజ్లో మారిపోయావేంటీ అమ్మడు.. శుభశ్రీ క్రేజీ ఫోటోస్ వైరల్..
బిగ్‌బాస్ సీజన్ 7 రియాల్టీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది శుభశ్రీ రాయగురు. మనోభావాలు దెబ్బతిన్నాయట అంటూ యూత్‌లో ఒక్కసారిగా ఫాలోయింగ్ పెంచేసుకుంది. కానీ అతి కొద్ది వారాల్లోనే షో నుంచి బయటకు వచ్చేసింది శుభశ్రీ. బిగ్‌బాస్ షోతో సూపర్ ఫేమ్ సొంతం చేసుకున్న శుభశ్రీకి ఇప్పుడు తెలుగు మంచి అవకాశాలు అందుకుంటుంది. ఒడిశాకు చెందిన ఈ అమ్మాయి..
Updated on: May 30, 2024 | 11:51 AM

బిగ్‌బాస్ సీజన్ 7 రియాల్టీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది శుభశ్రీ రాయగురు. మనోభావాలు దెబ్బతిన్నాయట అంటూ యూత్‌లో ఒక్కసారిగా ఫాలోయింగ్ పెంచేసుకుంది. కానీ అతి కొద్ది వారాల్లోనే షో నుంచి బయటకు వచ్చేసింది శుభశ్రీ.

బిగ్‌బాస్ షోతో సూపర్ ఫేమ్ సొంతం చేసుకున్న శుభశ్రీకి ఇప్పుడు తెలుగు మంచి అవకాశాలు అందుకుంటుంది. ఒడిశాకు చెందిన ఈ అమ్మాయి... నటనపై ఇంట్రెస్ట్ ఉండడంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఫెమినా మిస్ ఇండియా ఒడిశాతోపాటు పలు టైటిల్స్ గెలుచుకుంది.

ఆ తర్వాత నటిగా సినీ ప్రయాణం మొదలుపెట్టింది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. అలాగే హీరోయిన్ గా కూడా నటించింది. రుద్రవీణ, కథ వెనుక కథ లాంటి చిన్న చిన్న సినిమాల్లో కథానాయికగా నటించింది.

ఇక కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాలో పవల్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది. తెలుగుతోపాటు తమిళంలో పలు సినిమాలు, సీరియల్స్ చేసింది. ఇక బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తెలుగులో పాపులర్ అయిన ఈ హీరోయిన్.. ఆ తర్వాత సైలెంట్ అయ్యింది.

చాలా కాలం తర్వాత తన ఇన్ స్టాలో శుభశ్రీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఒకప్పుడు ఎంతో ముద్దుగా కనిపించిన ఈ వయ్యారి ఇప్పుడు సన్నజాజిలా కనిపిస్తుంది. ఇప్పుడు శుభశ్రీ షేర్ చేసిన లేటేస్ట్ స్టన్నింగ్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.




