- Telugu News Photo Gallery Cinema photos Bollywood heroines have fixed that acting in Telugu is better
Heroines: ఆడా ఉంటా ఈడా ఉంటా.! ఇదే హీరోయిన్స్ నుంచి వస్తున్న మాట..
నేను తెలుగు భాష లెక్క.. ఆడా ఉంటా ఈడా ఉంటా అని అల్లు అర్జున్ చెప్పిన మాటనే ఫాలో అవుతున్నారు హీరోయిన్లు. అదెలా అనుకుంటున్నారా..? ఇదిగో ఈ స్టోరీ పూర్తిగా చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. ఆడా ఉంటా ఈడా ఉంటా అనే కోడ్ కూడా అర్థమైపోతుంది. అయినా ఈ రోజుల్లో హీరోయిన్లు తక్కువేం కాదు.. అన్నిచోట్లా మేమే ఉంటామంటున్నారు. సర్లే ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం.. ముందైతే స్టోరీ చూసేయండి..!
Updated on: May 30, 2024 | 9:30 AM

ఒకప్పుడు బాలీవుడ్ బ్యూటీస్ టాలీవుడ్ వైపు చూడాలంటే.. నిర్మాతల ఆస్తులు కరిగిపోయేవి. వాళ్ల కండీషన్స్ ప్రొడ్యూసర్స్‌కు కాంతారాలో హీరో అరుపుల్లా భయంకరంగా వినబడేవి. కానీ ఇప్పుడు కాస్త బెటర్. ఎలాగూ టాలీవుడ్ దెబ్బ బాలీవుడ్‌పై బాగానే ఉంది కాబట్టి తెలుగులో నటించడమే బెటర్ అని ఫిక్సైపోయారు ముద్దుగుమ్మలు. అలాగని బాంబేను వదలట్లేదు.. బోనస్‌గా హైదరాబాద్‌లోనూ జెండా పాతేస్తున్నారు.

కావాలంటే కియారా అద్వానీనే తీసుకోండి.. బాలీవుడ్‌లో ఈమె స్టార్ హీరోయిన్. వరస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అక్కడ బానే ఉందిగా.. ఇంక టాలీవుడ్ ఎందుకు అనుకుంటున్నారా..? లేదే.. ఇక్కడా బిజీ అవుతున్నారు. గేమ్ ఛేంజర్‌లో కియారానే హీరోయిన్.

ఇక ఇన్నాళ్లూ హిందీలోనే ఉన్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. దేవరతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో పాటు రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో కూడా కథానాయకిగా నటిస్తుంది.

కెరీర్ కొత్తలో నేనొక్కడినే, దోచేయ్ సినిమాలు చేసిన కృతి సనన్.. గతేడాది ఆదిపురుష్‌తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు. ఛాన్స్ ఉంటె ఇంకా తెలుగు సినిమాల్లో చేయడానికి సిద్ధంగా ఉంది ఈ బ్యూటీ.

కెరీర్ కొత్తలో నేనొక్కడినే, దోచేయ్ సినిమాలు చేసిన కృతి సనన్.. గతేడాది ఆదిపురుష్‌తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు. ఛాన్స్ ఉంటె ఇంకా తెలుగు సినిమాల్లో చేయడానికి సిద్ధంగా ఉంది ఈ బ్యూటీ.




