Anti-Aging Diet: 40 ఏళ్ల తర్వాత కూడా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ 5 యాంటీ ఏజింగ్ ఫుడ్స్‌ని డైట్‌లో చేర్చుకోండి

చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవాలన్నా, వయస్సు పెరుగుతున్న కొద్దీ ముడతలు లేకుండా ఉండాలన్నా తినే ఆహారంలో యాంటీ ఏజింగ్ గుణాలు కలిగిన ఆహారాలను చేర్చుకోవాల్సి ఉంటుంది. అవును న్యూట్రిషన్, హెయిర్ అండ్ స్కిన్ కేర్ ఎక్స్‌పర్ట్ కిరణ్ కుక్రేజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసారు. 5 యాంటీ ఏజింగ్ ఫుడ్స్ గురించి చెప్పారు. నిస్తేజమైన చర్మం, వృద్ధాప్య ప్రభావాలను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది బొప్పాయి. ఇది వృద్ధాప్యాన్ని నిరోధించే ఆహారం అని చెప్పవచ్చు. దీన్ని తినే ఆహారంలో చేర్చుకోవడం వలన చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుకోవచ్చు.

Anti-Aging Diet: 40 ఏళ్ల తర్వాత కూడా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ 5 యాంటీ ఏజింగ్ ఫుడ్స్‌ని డైట్‌లో చేర్చుకోండి
Anti Aging Diet
Follow us
Surya Kala

|

Updated on: May 30, 2024 | 12:18 PM

ఆరోగ్యంగా అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ వచ్చే మార్పుల్లో భాగంగా చర్మం కాంతి విహీనంగా మారుతుంది. ముడుతలు పడుతుంది. కొంతమందికి మాత్రం వయసుతో సంబంధం లేకుండా చర్మంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవాలన్నా, వయస్సు పెరుగుతున్న కొద్దీ ముడతలు లేకుండా ఉండాలన్నా తినే ఆహారంలో యాంటీ ఏజింగ్ గుణాలు కలిగిన ఆహారాలను చేర్చుకోవాల్సి ఉంటుంది. అవును న్యూట్రిషన్, హెయిర్ అండ్ స్కిన్ కేర్ ఎక్స్‌పర్ట్ కిరణ్ కుక్రేజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసారు. 5 యాంటీ ఏజింగ్ ఫుడ్స్ గురించి చెప్పారు.

బొప్పాయి: నిస్తేజమైన చర్మం, వృద్ధాప్య ప్రభావాలను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది బొప్పాయి. ఇది వృద్ధాప్యాన్ని నిరోధించే ఆహారం అని చెప్పవచ్చు. దీన్ని తినే ఆహారంలో చేర్చుకోవడం వలన చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుకోవచ్చు. బొప్పాయిలో అధిక మొత్తంలో పపైన్, విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ ఎ, మెగ్నీషియం, పొటాషియం, రాగి, విటమిన్ కె ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు స్కిన్ పై ముడతలు పడకుండా చేయడంలో సహాయపడుతుంది.

గుమ్మడి గింజలుల: గుమ్మడి గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, జింక్ వంటి ఆరోగ్యాన్ని ఇచ్చే పోషకాలు అధికంగా ఉన్నాయి. ఇవి చర్మ సంబంధిత మొటిమలు, మచ్చలు, నల్లటి వలయాలు, ముడతలు మొదలైన సమస్యలను తొలగిస్తాయి. గుమ్మడికాయలో ఉండే ఎంజైమ్‌లు, ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు మృత చర్మ కణాలను తొలగించి చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా మార్చుతాయి. ఇవి ఫైన్ లైన్స్ (ముఖంపై ఉండే గీతలు), ముడతలను తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

గోధుమ గడ్డి రసం: వృద్ధాప్య ప్రభావాలను తగ్గించడానికి రాకరకాల కూరగాయల రసం సహాయం తీసుకోవచ్చు. కూరగాయల రసం మాత్రమే కాదు చాలా మంది ప్రజలు గోధుమ గడ్డి రసం తాగడానికి ఇష్టపడతారు. రుచిగా ఉండటమే కాదు ఈ రసం యాంటీ ఏజింగ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. గోధుమ గడ్డిలో ఉండే క్లోరోఫిల్ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇవి వృద్ధాప్య వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడతాయి.

కొబ్బరి నీరు: కొబ్బరి నీళ్లలో సైటోకినిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది వృద్ధాప్యాన్ని నిరోధించే లక్షణాలను కలిగి ఉంటుంది. కొబ్బరి నీళ్లలో ఉండే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. అనేక యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న కొబ్బరి నీరు సహజంగా కొల్లాజెన్ సంశ్లేషణను ప్రేరేపిస్తుంది. కొబ్బరి నీరు చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరచడం ద్వారా మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.

అవిసె గింజలు: అవిసె గింజలలో ఉండే ఒమేగా-3 శరీరంలో కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ముడతలు, అకాల వృద్ధాప్యం వంటి లక్షణాలను తగ్గిస్తుంది.

అయితే ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అన్నీ అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో సహాయపడతాయి. అయితే అందమైన, మెరిసే చర్మం కోసం సమతుల్య ఆహారం, సూర్య కిరణాల నుంచి రక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..