Plastic Box: మీరు కూడా ప్లాస్టిక్ బాక్సులోనే ఆహారం తీసుకెళ్తున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..?
ప్లాస్టిక్ కంటైనర్‌లో ఉంచిన నీరు కూడా దానితో సంబంధంలోకి వచ్చిన తర్వాత కలుషితమై విషపూరితం అవుతుంది. ప్లాస్టిక్ టిఫిన్ వాడకం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. ప్లాస్టిక్ టిఫిన్‌లో ఉంచిన ఆహారాన్ని తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడటం ఆరోగ్యానికి చాలా హానికరం. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

ఈ రోజుల్లో చాలా మంది స్టీలు, రాగి పాత్రలను వదిలేసి ప్లాస్టిక్ వాడకానికి అలవాటుపడుతున్నారు. ప్రజలు తమ నిత్యజీవితంలో ప్లాస్టిక్ వినియోగంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇంటి నుండి మార్కెట్ లేదా స్కూలు, ఆఫీసు వరకు ప్రతిచోటా ప్లాస్టిక్ ఆక్రమించేసింది. డ్రింకింగ్ వాటర్ బాటిళ్ల నుంచి ఫుడ్ ప్యాకేజింగ్ బాక్సుల వరకు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయంగా మారింది. కానీ, ప్లాస్టిక్‌ని ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్యంతో పాటు ప్రకృతికి కూడా అనేక విధాలుగా హాని కలుగుతుందని మీకు తెలుసా? ఈ రసాయనంతో తయారైన ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. ప్లాస్టిక్ కంటైనర్‌లో ఉంచిన నీరు కూడా దానితో సంబంధంలోకి వచ్చిన తర్వాత కలుషితమై విషపూరితం అవుతుంది. ప్లాస్టిక్ టిఫిన్ వాడకం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. ప్లాస్టిక్ టిఫిన్‌లో ఉంచిన ఆహారాన్ని తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడటం ఆరోగ్యానికి చాలా హానికరం. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.
– BPA (బిస్ఫినాల్ A) అనేది అనేక ప్లాస్టిక్ ఉత్పత్తులలో కనిపించే రసాయనం. ఇది హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి ఆరోగ్యం, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది.
– PHTHALATES అనే రసాయనం కూడా ప్లాస్టిక్‌లో ఉంటుంది. ఇది ప్లాస్టిక్‌ను ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది. కానీ, ఇది ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా పిల్లలకు అత్యంత హని కలిగించేదిగా నిపుణులు చెబుతున్నారు.
– ప్లాస్టిక్ టిఫిన్లు లేదా బాటిళ్లలో వేడి ఆహారాన్ని లేదా నీటిని ఉంచడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే ప్లాస్టిక్ రసాయనాలు ఆహారంలోకి చేరుతాయి. అంతే కాకుండా ప్లాస్టిక్‌ని అధికంగా వాడటం వలన అది విచ్ఛిన్నమై మైక్రోప్లాస్టిక్ కణాలు ఏర్పడతాయి. అవి ఆహారం నీటిలోకి ప్రవేశించి మన శరీరంలోకి చేరిపోయి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.
-ప్లాస్టిక్ టిఫిన్లు ఎక్కువ కాలం ఉపయోగించలేరు. ఇవి త్వరగా అరిగిపోతాయి లేదా పాడైపోతాయి. దీంతో అవి చెత్తకుప్పల్లో పడుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను సక్రమంగా పారవేయకపోతే పర్యావరణంలోకి వ్యాపించి నీరు, వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ఈ కాలుష్యం ఏదో ఒక విధంగా తిరిగి మానవ శరీరంలోకి చేరి ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుంది.
– ప్లాస్టిక్ టిఫిన్లు, సీసాలు కాలక్రమేణా ఆహారం, నీటిలో విచిత్రమైన రుచి, వాసనలను కలిగిస్తాయి. దీని వలన ఆహారం పాడవుతుంది. అందువల్ల వీలైనంత మేరకు తక్కువ ప్లాస్టిక్‌ను ఉపయోగించే ప్రయత్నం చేయాలి. ప్లాస్టిక్ టిఫిన్‌కు బదులుగా స్టీల్ లేదా గ్లాస్ టిఫిన్ వాడండి. అలాగే, ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగొద్దు, వీలైనప్పుడల్లా గ్లాసులో నీళ్లు తాగాలి. మీ సొంత స్టీల్ లేదా రాగి బాటిల్‌లో ఇంటి నుండి నీటిని తీసుకువెళ్లండి. మార్కెట్‌లో లభించే ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను కొనుగోలు చేయవద్దు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








