Viral: 50 ఏళ్ల నాటి పురాతన ఇంట్లో సీక్రెట్ రూమ్.. తలుపు తెరిచిన మహిళకు కనిపించిన సీన్‌ చూసి పరార్..!

అయితే, అంతకుముందు ఇంట్లో ఉన్న వారికి కూడా ఈ రహస్య గది గురించి తెలియదని చెప్పింది.. ఈ ఇంటి యజమాని రహస్య గది గురించి మాకు ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. సీక్రెట్ రూం తెరిచి అక్కడున్న మెటీరియల్, ఆ అరేంజ్ మెంట్ చూడగానే ఒకరకమైన అయోమయం, ఆందోళన కలిగింది. రహస్య గదిని తెరిచిన 10 రోజుల తర్వాత..

Viral: 50 ఏళ్ల నాటి పురాతన ఇంట్లో సీక్రెట్ రూమ్.. తలుపు తెరిచిన మహిళకు కనిపించిన సీన్‌ చూసి పరార్..!
Secret Room
Follow us
Jyothi Gadda

|

Updated on: May 30, 2024 | 10:24 AM

దాదాపు 50 నుంచి 60 ఏళ్ల తర్వాత ఇంట్లోని రహస్య గది తలుపు తీసిన అనుభవాన్ని ఓ మహిళ సోషల్ మీడియాలో పేర్కొంది. ఆ సీక్రెట్ రూమ్ తలుపు తీసిన 10 రోజుల తర్వాత సదరు మహిళ అక్కడి నుంచి మరో చోటికి వెళ్లిపోయింది. ఆ రహస్య గది తలుపు తెరిచిన రోజు తనకు ఎదురైన అనుభవం ఏ హర్రర్ సినిమా కంటే తక్కువ కాదని సదరు మహిళ పేర్కొంది. అయితే, ఆ ఇల్లు తన సోదరి ఇటీవలే కొనుగోలు చేసినట్టుగా చెప్పింది. ఆ ఇంట్లో ఉన్న సీక్రెట్‌ గది గురించి ఎవరికీ తెలియదని, తాను తన సోదరి ఇంట్లో ఉండేందుకు వచ్చిన క్రమంలో ఇంట్లోని రహస్య గది గురించి తెలిసిందని చెప్పింది.. ఆ గది తలుపు తీసిన మహిళ ఆ రూమ్‌లో ఏం చూసింది..? అక్కడ ఎలాంటి వస్తువులు ఉన్నాయో తెలిస్తే మీరు కూడా షాక్‌ అవుతారు.

సదరు మహిళ చెప్పిన వివరాల మేరకు.. ఆ ఇంట్లో దాదాపు 50 ఏళ్లుగా తాళం వేసి ఉన్న ఒక గది ఉంది. ఆ రూమ్‌ తలుపు సాధారణ కీలతో తెరవడం సాధ్యం కాదని చెప్పారు. అందువల్లే తమ కంటే ముందు ఆ గది తలుపులు ఎవరూ తీయలేదని అర్థమైందన్నారు. తాము ఆ గది తలుపు తెరిచి చూడగానే.. అక్కడ కనిపించిన వస్తువులు చూస్తే కళ్లు బైర్లు కమ్మేశాయని చెప్పారు.. అది హాంటెడ్ రూమ్ అనుకుని మొదట తామంతా భయపడ్డామని చెప్పారు. ఇంతకీ ఆ రహస్య గదిలో ఏముందో తెలుసా.?

ఆ గదిలో 70-80ల నాటి అశ్లీల మ్యాగజైన్, మద్యం సీసాలు, పెట్రోలియం జెల్లీ బాటిల్, నోట్ ప్యాడ్, టాంపాన్, కొన్ని ప్యాడ్‌లు, లైంగిక కార్యకలాపాల సమయంలో ఉపయోగించే ఇతర వస్తువులు కనిపించాయట. అవి మాత్రమే కాదు..ఆ గదిలో మంచం, రెండు దిండ్లు, టూత్ బ్రష్‌తో సహా కొన్ని క్లీనింగ్‌ పదార్థాలు ఉన్నాయని మహిళ పేర్కొంది. 70-80 దశకంలో ఈ గదిని అనైతిక కార్యకలాపాలకు వినియోగించి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఇలాంటి ఇంట్లో ఉండటం తన వల్ల కాదని భావించింది.

ఇవి కూడా చదవండి

అయితే, అంతకుముందు ఇంట్లో ఉన్న వారికి కూడా ఈ రహస్య గది గురించి తెలియదని చెప్పింది.. ఈ ఇంటి యజమాని రహస్య గది గురించి మాకు ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. సీక్రెట్ రూం తెరిచి అక్కడున్న మెటీరియల్, ఆ అరేంజ్ మెంట్ చూడగానే ఒకరకమైన అయోమయం, ఆందోళన కలిగింది. రహస్య గదిని తెరిచిన 10 రోజుల తర్వాత తన సోదరి ఇంటి నుండి బయటకు వచ్చేసిందని చెప్పింది. కానీ, ఆ మహిళ తన గుర్తింపు, ఆ ఇంటి స్థలం ఎక్కడ అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..