watch video: ఓరీ దేవుడో.. 10 అడుగుల మొసలి రైలింగ్ పైకి ఎక్కుతోంది..! ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..

10 అడుగుల భారీ మొసలి నదీ నుంచి బటయకు వచ్చి సమీపంలోని ప్రాంతంలో సంచరించింది. ఈ సందర్భంగానే అడ్డుగా ఉన్న రైలింగ్ పైకి ఎక్కేందుకు ఆ భారీ మొసలి ప్రయత్నించింది. ఇదంతా చూస్తూ స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే సాధ్యం కాకపోవడంతో కింద పడింది. వెంటనే పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

watch video: ఓరీ దేవుడో.. 10 అడుగుల మొసలి రైలింగ్ పైకి ఎక్కుతోంది..! ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..
crocodile attempts to climb over a railing
Follow us
Jyothi Gadda

|

Updated on: May 30, 2024 | 7:47 AM

Viral Video: మొసలి..ఈ పేరు వింటనే జనాలు భయపడుతుంటారు. అలాంటిది ఓ భారీ మొసలి రద్దీగా ఉన్న రోడ్డు పైకి రావడంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతేకాదు..దాదాపు10 అడుగుల పొడవున్న ఆ మొసలి కాళ్లు, చేతులు కలిగి ఉన్న మనిషిలా ప్రవర్తించటం చూసి ప్రజలు షాక్‌కు గురయ్యారు. పక్కనే ఉన్న నదిలోంచి బయటకు వచ్చిన భారీ మొసలి సమీపంలోని రైలింగ్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ షాకింగ్ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది..? అసలు సంగతి ఏంటో పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్ షహర్‌లోని నరోరా ఘాట్ వద్ద 10 అడుగుల భారీ మొసలి నదీ నుంచి బటయకు వచ్చి సమీపంలోని ప్రాంతంలో సంచరించింది. ఈ సందర్భంగానే అడ్డుగా ఉన్న రైలింగ్ పైకి ఎక్కేందుకు ఆ భారీ మొసలి ప్రయత్నించింది. ఇదంతా చూస్తూ స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే సాధ్యం కాకపోవడంతో కింద పడింది. వెంటనే పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఎట్టకేలకు స్థానికులు, పోలీసు, అటవీ శాఖ అధికారులు అతికష్టం మీద మొసలిని పట్టుకున్నారు. అనంతరం సురక్షితంగా నదిలోకి విడిచిపెట్టారు. మరి కొందరు మొసలి రైలింగ్‌ ఎక్కుతున్న దృశ్యాలను తమ మొబైల్స్‌లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…