Surgery: కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన యువకుడు.. ఎక్స్‌రే తీసి చూడగా అవాక్కైన వైద్యులు!

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఓ యువకుడికి వైద్యులు టెస్టులు చేయగా షాకింగ్‌ సీన్‌ కనిపించింది. అతని కడుపులో ఐరన్‌ సామాన్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వెంటనే సదరు యువకుడికి శస్త్రచికిత్స నిర్వహించి, అతని ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సవాయ్‌ మాన్‌సింగ్‌ ఆస్పత్రి సీనియర్ వైద్యుడు..

Surgery: కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన యువకుడు.. ఎక్స్‌రే తీసి చూడగా అవాక్కైన వైద్యులు!
Iron Nails In Man's Stomach
Follow us
Srilakshmi C

|

Updated on: May 29, 2024 | 8:09 PM

జైపూర్‌, మే 29: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఓ యువకుడికి వైద్యులు టెస్టులు చేయగా షాకింగ్‌ సీన్‌ కనిపించింది. అతని కడుపులో ఐరన్‌ సామాన్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వెంటనే సదరు యువకుడికి శస్త్రచికిత్స నిర్వహించి, అతని ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సవాయ్‌ మాన్‌సింగ్‌ ఆస్పత్రి సీనియర్ వైద్యుడు రాజేంద్ర మాండియా తెలిపిన వివరాల ప్రకారం..

తీవ్ర కడుపు నొప్పితో 21 ఏళ్ల యువకుడు ఇటీవల జైపుర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ ఆస్పత్రికి వచ్చాడు. అక్కడి వైద్యులు అతడికి ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ లాంటి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతడి పొట్టలో ఇనుప వస్తువులు భారీ మొత్తంలో ఉన్నట్లు గుర్తించారు. వాటిలో కొన్ని పెద్ద పేగులోకి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో వైద్య బృందం అతడికి లాప్రోస్కోపీ, కొలనోస్కోపీ నిర్వహించింది.

దాదాపు మూడు గంటలపాటు నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో అతడి కడుపులో నుంచి ఆ వస్తువులను తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆపరేషన్‌ తర్వాత అతడి కడుపులో నుంచి ఇనుప మేకులు, సూదులు, నట్లు, తాళం చెవి, గోళ్లు, సూదులు వంటి పలు వస్తువులను తొలగించారు. నిజానికి, బాధిత యువకుడి మానసిక స్థితి సరిగ్గా లేదని, ఈ క్రమంలోనే అతడు ఇనుప వస్తువులను మింగినట్లు అతడి కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో తాజాగా తీవ్ర కడుపు నొప్పి రావడంతో తొలుత ఆళ్వార్‌లోని ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యుల సూచన మేరకు జైపూర్‌కు తీసుకొచ్చినట్లు తెలిపారు

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.