IT Raids: నగల దుకాణంలో ఐటీ దాడులు.. రూ. కోట్ల విలువైన నోట్ల కట్టలు.

IT Raids: నగల దుకాణంలో ఐటీ దాడులు.. రూ. కోట్ల విలువైన నోట్ల కట్టలు.

Anil kumar poka

|

Updated on: May 29, 2024 | 8:03 PM

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ నగల దుకాణంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు నిర్వహించిన దాడుల్లో కట్టల కొద్దీ నగదు పట్టుబడింది. స్థానిక సురానా జ్యువెలర్స్ యజమాని అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. సోదాల్లో సుమారు 26 కోట్ల క్యాష్‌, 90 కోట్ల విలువైన.. లెక్కల్లో చూపని ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ నగల దుకాణంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు నిర్వహించిన దాడుల్లో కట్టల కొద్దీ నగదు పట్టుబడింది. స్థానిక సురానా జ్యువెలర్స్ యజమాని అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. సోదాల్లో సుమారు 26 కోట్ల క్యాష్‌, 90 కోట్ల విలువైన.. లెక్కల్లో చూపని ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయపు పన్ను శాఖ వివిధ బృందాలను ఏర్పాటు చేసి సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. జ్యువెలర్స్ యజమాని కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు జరిగినట్లు సమాచారం. ఓ బులియన్ ట్రేడర్ వద్ద ఇంత పెద్ద మొత్తంలో నగదు, ఆస్తులు లభించడం చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఆ వ్యాపారికి ఇంత సంపద ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్రలోని వ్యాపారులపై గత కొన్ని రోజులుగా ఆదాయపు పన్ను శాఖ గట్టి నిఘా పెట్టింది. ఇటీవల నాందేడ్ లో 170 కోట్ల రూపాయల విలువైన లెక్కల్లోకి రాని ఆస్తులను సీజ్ చేసింది. తాజాగా నాసిక్‌లో దాడులు చేసింది. నోట్లను లెక్కించడానికి ఆదాయపు పన్ను శాఖకు చాలా గంటల సమయం పట్టింది. దీని కోసం పలు బృందాలను పిలిపించగా బయటకు వచ్చిన లెక్కలు దిగ్భ్రాంతికి గురిచేశాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.