Rishi Sunak – Akshata Murthy: ఆ విషయాల్లో ఇద్దరం ఒక్కటే.. రిషి సునాక్, అక్షతా మూర్తిల ఆసక్తికర పోస్ట్..
మరికొన్ని రోజుల్లో బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ అక్షతా మూర్తి దంపతుల పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఇద్దరి అభిరుచులకు సంబంధించి అనేక మంది అడిగే ప్రశ్నలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. దాంపత్య జీవితంలో వారి అభిరుచులు, పనిపట్ల నిబద్ధత, తాము అనుసరించే విలువల గురించి అందులో వివరించారు.
మరికొన్ని రోజుల్లో బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ అక్షతా మూర్తి దంపతుల పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఇద్దరి అభిరుచులకు సంబంధించి అనేక మంది అడిగే ప్రశ్నలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. దాంపత్య జీవితంలో వారి అభిరుచులు, పనిపట్ల నిబద్ధత, తాము అనుసరించే విలువల గురించి అందులో వివరించారు. మేమిద్దరం కలిసి ఎక్కడికి వెళ్లినా ఇతరుల నుంచి ఎదురయ్యే మొదటి ప్రశ్న.. మీలో కామన్‌గా కనిపించే విషయం ఏంటి? అని. దాంపత్య జీవితంలో కలిసి సినిమాలు చూడడం, నచ్చిన ఆహారాన్ని తినడం మాత్రమే కాదు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఉంది. అదే విలువలను పంచుకోవడం. జీవితంలో ఏ స్థాయిలో ఉండాలో మన కష్టమే నిర్ణయిస్తుంది. దాన్నే మేమిద్దరం విశ్వసిస్తాం. ఏదైనా సాధించాలంటే మాత్రం సాహసోపేతమైన నిర్ణయాలు అవసరమనే విషయంలోనూ ఇద్దరిదీ ఒకటే మాట.
దాని ఫలితంగా మనకంటే మెరుగైన ప్రపంచాన్ని మన పిల్లలు వారసత్వంగా పొందుతారని మా విశ్వాసం. ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడం అనే విలువలను వారికి పంచుతున్నాం’’ అని పోస్టు పెట్టారు. రిషి, అక్షతా సంయుక్తంగా పెట్టిన ఈ పోస్టుకు తమ ఫొటోను జత చేశారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది. దాంపత్య జీవితంలో పాటిస్తున్న విలువలు, సహకారం, భవిష్యత్తుపై వారికి ఉన్న నిబద్ధత, ముందుచూపుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. జులై 4న బ్రిటన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భర్త సునాక్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తానని అక్షతా వెల్లడించారు. తాజాగా వీరిద్దరూ పెట్టిన పోస్టు అందరినీ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

