Human Milk: ఎవరైనా తల్లి పాలు అమ్మితే చర్యలు తప్పవు, ఎఫ్ఎస్ఎస్ఏఐ వార్నింగ్.
శిశువులకు తల్లిపాలు ఎంత విలువైనవో తెలిసిందే. శిశువులకు తల్లిపాల ద్వారానే వ్యాధి నిరోధక శక్తి అందుతుంది. అయితే, కొందరు తల్లులకు పాలు రాకపోవడం, కొందరు శిశువులకు తల్లిపాలు అందని పరిస్థితులు ఉన్నాయి. అందుకే ప్రభుత్వమే పాల బ్యాంకులను ఏర్పాటు చేసి ఉచితంగా తల్లి పాలను అందిస్తోంది. అయితే, తల్లి పాలను అమ్మకానికి పెట్టడం చట్ట వ్యతిరేకమని, అలా ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరించింది.
శిశువులకు తల్లిపాలు ఎంత విలువైనవో తెలిసిందే. శిశువులకు తల్లిపాల ద్వారానే వ్యాధి నిరోధక శక్తి అందుతుంది. అయితే, కొందరు తల్లులకు పాలు రాకపోవడం, కొందరు శిశువులకు తల్లిపాలు అందని పరిస్థితులు ఉన్నాయి. అందుకే ప్రభుత్వమే పాల బ్యాంకులను ఏర్పాటు చేసి ఉచితంగా తల్లి పాలను అందిస్తోంది. అయితే, తల్లి పాలను అమ్మకానికి పెట్టడం చట్ట వ్యతిరేకమని, అలా ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ఎఫ్ఎస్ఎస్-2006 యాక్ట్ ప్రకారం తల్లి పాల విక్రయానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.
పాలిచ్చే తల్లుల నుంచి ప్రభుత్వమే పాలను సేకరించి, అవసరంలో ఉన్న చిన్నారులకు అందిస్తుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. ఆ మేరకు ప్రభుత్వం పాల బ్యాంకులు ఏర్పాటు చేసిందని వివరించింది. అయితే, కొందరు వ్యాపార దృక్పథంతో తల్లిపాలను విక్రయిస్తున్నారని, ఆన్ లైన్ లో ఇలాంటి అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అనుమతి లేని ఇలాంటి అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించింది. అంతేకాదు, తల్లిపాల విక్రయానికి ప్రయత్నించే వ్యాపారులకు లైసెన్స్ లు జారీ చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్దేశించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

