KTR: హైదరాబాద్‌కు ఐకాన్‌ చార్మినార్.. రాజకీయ కక్షతోనే రాజముద్రను మారుస్తున్నారు.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్

తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.. చిహ్నంలో మార్పులు చేర్పులపై కసరత్తులు జరుగుతున్నాయి.. ప్రజలు, ప్రజాజీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా దీనిని రూపొందించేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయించింది..

KTR: హైదరాబాద్‌కు ఐకాన్‌ చార్మినార్.. రాజకీయ కక్షతోనే రాజముద్రను మారుస్తున్నారు.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Ktr
Follow us

|

Updated on: May 30, 2024 | 12:23 PM

తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.. చిహ్నంలో మార్పులు చేర్పులపై కసరత్తులు జరుగుతున్నాయి.. ప్రజలు, ప్రజాజీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా దీనిని రూపొందించేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయించింది.. అయితే, అంతకుముందున్న చిహ్నంలోని చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తారనే ప్రచారం జరుగుతుండటంతో బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ చిహ్నం మార్పుపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతోంది బీఆర్ఎస్. హైదరాబాద్ చార్మినార్‌ దగ్గర జరిగిన నిరసనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చిహ్నంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను సర్కార్ మారుస్తోందని చెప్పారు. కేసీఆర్‌ పేరు వినిపించకూడదన్నట్టుగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ చారిత్రక కట్టడాలైన చార్మినార్‌, కాకతీయుల కళాతోరణాన్ని లోగోలో ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు కేటీఆర్‌. రాజకీయ కక్షతోనే రాజముద్రను మారుస్తూ.. మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.

అంతకుముందు రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ ను తొలగించడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. చార్మినార్ దశాబ్దాల తరబడి హైదరాబాద్‌కు ఐకాన్‌గా ప్రపంచంలోనే గుర్తింపు పొందిందని.. నగరం గురించి ఎవరైనా ఆలోచిస్తే వారు ప్రపంచ వారసత్వ హోదా పొందేందుకు అన్ని అర్హతలున్న చార్మినార్ గురించి ఆలోచించకుండా ఉండలేరని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పనికిరాని కారణాలను సాకుగా చూపుతూ చార్మినార్‌ను రాష్ట్ర అధికారిక ముద్ర నుంచి తొలగించాలని భావిస్తోందంటూ ఎక్స్ లో రాశారు.

కేటీఆర్ ట్వీట్..

కాగా.. రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వరంగల్ లో బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఈ ఫొటోను కూడా కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..