AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నువ్వు లేక జీవితం లేదన్నాడు.. చివరికి ప్రియురాలి ఆత్మహత్యకు కారణమయ్యాడు..!

హైదరాబాద్ శివారులో దారుణం వెలుగు చూసింది. ప్రేమించిన వ్యక్తి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Telangana: నువ్వు లేక జీవితం లేదన్నాడు.. చివరికి ప్రియురాలి ఆత్మహత్యకు కారణమయ్యాడు..!
Love Fail
Noor Mohammed Shaik
| Edited By: Balaraju Goud|

Updated on: May 30, 2024 | 8:51 AM

Share

హైదరాబాద్ శివారులో దారుణం వెలుగు చూసింది. ప్రేమించిన వ్యక్తి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చివరికి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు ఓ ప్రబుద్ధుడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనీ న్యూ ఎల్ బీ నగర్‌లో నివాసముండే బాలబోయిన కుమార్ కుమార్తె అఖిల(22) ప్రైవేట్ జాబ్ చేస్తోంది. అయితే మే28వ తేదీ మంగళవారం రాత్రి అకస్మాత్తుగా ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అఖిలను పోరగంటి ప్రాంతానికి చెందిన అఖిల్ సాయి గౌడ్ ప్రేమ పేరుతో వెంటపడి వేధించాడు. తన ప్రేమలో ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో తప్పని పరిస్థితితో అఖిల అతని ప్రేమలో ఒప్పుకుంది.

ఇదే విషయాన్ని వారి కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఆ ఇష్టాన్ని కాదనలేక బంధువుల సమక్షంలో అందరు మాట్లాడడంతో కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ప్రేమను ఒప్పుకున్నప్పటి నుండి అఖిల్ సాయి గౌడ్ అఖిలను చాలా ఇబ్బందులకు గురి చేశాడు. రోడ్డుమీద అందరూ చూస్తుండగానే శారీరకంగా, మానసికంగా చిత్ర హింసలు పెట్టాడు. అంతే కాకుండా ఫోన్‌లో కూడా వేధించాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషయం స్థానికులకు, బంధువులకు తెలవడంతో అతగాడిని మందలించారు.

కొన్ని ఏళ్ళుగా సాగిన వీరి ప్రేమకు కాదని, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు అఖిల్ సాయి. దీంతో మానసికంగా కుంగిపోయిన అఖిల ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తండ్రి కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..