Telangana: అట.. ఇటు తిరిగి.. చివరికి కేఏ పాల్ పార్టీలోకి ఏంట్రీ ఇచ్చిన ప్రజా గాయకుడు.. ఎన్నికల్లో పోటీ కూడా
ప్రజా గాయకుడు గద్దర్ గురించి ఉభయ తెలుగురాష్ట్రాల్లో పెద్ద పరిచయం అవసరం లేదు. విప్లవ గీతాలు పాడటంతో ఆయనకు ఆయనే సాటి. విప్లవ గీతాల ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి గద్దర్ పరియస్తులే. ఆయన వేషదారణ కూడా ఓ ప్రత్యేకమనే చెప్పుకోవాలి. గద్దర్ ను ముఖం కంటే ఆయన వేషదారణ..
ప్రజా గాయకుడు గద్దర్ గురించి ఉభయ తెలుగురాష్ట్రాల్లో పెద్ద పరిచయం అవసరం లేదు. విప్లవ గీతాలు పాడటంతో ఆయనకు ఆయనే సాటి. విప్లవ గీతాల ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి గద్దర్ పరియస్తులే. ఆయన వేషదారణ కూడా ఓ ప్రత్యేకమనే చెప్పుకోవాలి. గద్దర్ ను ముఖం కంటే ఆయన వేషదారణ చూసి ఈజీగా గుర్తుపడతారు. ఈ మధ్య బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల వద్దకు వెళ్లడంతో ఆయన వార్తల్లో నిలిచారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన బీజేపీకి చెందిన ఓ బహిరంగ సభలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపర్చాడు గద్దర్. అయితే ప్రధాని మోదీ స్పీచ్ వినడానికి వచ్చానని, ఆయన ఏం చెప్తారో విందామని వచ్చానని చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా గద్దర్ కలిశారు. ఒకానొక సందర్భంలో గద్దర్ బీజేపీ పార్టీలో చేరతారా అనే ప్రచారం జరిగింది. అయితే అన్ని పార్టీల నాయకులను కలవడంతో ఆ తర్వాత ఆయనను ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. అయితే తాజాగా గద్దర్, కెఎల్.పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీలో చేరి అందరినీ ఆశ్చర్యపర్చారు. అంతేకాదు మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయనున్నారు. దీంతో ప్రజాగాయకుడు గద్దర్ తొలిసారి ఎన్నికల్లో పోటీచేయబోతున్నారు. హైదరాబాద్ లోని కేఏ.పాల్ సమక్షంలో గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గద్దర్ మునుగోడు ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తారని కేఎ.పాల్ ప్రకటించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్టు గద్దర్ తెలిపారు. ప్రపంచశాంతి కోసం కృషి చేస్తున్న కేఎ.పాల్‌తో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రజల ఆశీర్వాదం కోసం అక్టోబర్ 6వ తేదీ (గురువారం) నుంచే ప్రచారం ప్రారంభిస్తానన్నారు.
నవంబరు 3న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్, 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే వామపక్ష భావజాలం ఉన్న గద్దర్ మునుగోడు బరిలో దిగుతున్నారు. ఇప్పటికే వామపక్షాలు మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ ఎస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నప్పటికి.. ఎప్పటినుంచో పార్టీలో ఉన్న కార్యకర్తలు టీఆర్ ఎస్ కు ఓటు వేస్తారా లేదా అనేది ఓ పెద్ద ప్రశ్నగానే మిగిలిపోనుంది. ఈ నేపథ్యంలో వామపక్ష భావజాలం ఉన్న గద్దర్ పోటీ చేస్తుండటంతో వామపక్ష పార్టీల అభిమానుల ఓట్లు గద్దర్ కు పడే అవకాశాలు లేకపోలేదు. గద్దర్ మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేస్తున్నప్పటికి.. ఆయన పెద్ద పోటీదారుడు కాకపోవచ్చు. ప్రజాశాంతి పార్టీకి తెలంగాణలో అసలు ఎటువంటి బలం లేకపోవడంతో ఆ పార్టీ నామమాత్రమైన పోటీని కూడా ఇచ్చే అవకాశం లేదు. త్రిముఖ పోటీ ఉన్న మునుగోడులో గెలుపుపై టీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేయనుండగా, టీఆర్ ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికి అధికారికంగా టీఆర్ ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికి.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపు హైకమాండ్ చూపు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే టీఆర్ ఎస్ అభ్యర్థి ఎవరనేదానిపై పూర్తి క్లారిటీ రానుంది.
బీజేపీ, టీఆర్ ఎస్, కాంగ్రెస్ తో పాటు ప్రజాశాంతి పార్టీ మునుగోడు బరిలో నిలుస్తున్నాయి. బీఎస్పీ నుంచి కూడా అభ్యర్థి పోటీచేసే అవకాశం ఉంది. మరి కొంతమంది ఇండిపెంట్ అభ్యర్థులు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. మరోవైపు టీఆర్ ఎస్ పేరుతో అభ్యర్థి పోటీలో ఉంటారా లేదా కొత్తగా ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి పేరుతో అభ్యర్థి పోటీలో ఉంటారా అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. కొత్త పార్టీ పేరుతోనే మునుగోడు బరిలో ఉంటామని కేసీఆర్ గతంలో చెప్పారు. అయితే ఇప్పటికే ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. కేసీఆర్ జాతీయ పార్టీ పేరును ప్రకటించినప్పటికి, పార్టీని ఎన్నికల సంఘం గుర్తించాల్సి ఉంటుంది. ఆ పనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ఆ పార్టీ నాయకులు హస్తినకు వెళ్లారు. రేపు ఎన్నికల సంఘాన్ని కలిసిన తర్వాత ఈసీ తీసుకునే నిర్ణయంపై టీఆర్ ఎస్ అభ్యర్థి పోటీ చేస్తారా లేదా బీఆర్ ఎస్ తరపున పోటీ చేస్తారా అనే క్లారిటీ రానుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..