Andhra Pradesh: జయహో కేసీఆర్.. విజయవాడలోనూ BRS ఫ్లెక్సీలు.. భారీ బహిరంగ సభకు నేతల ప్లాన్..!
దేశ రాజకీయాల్లో మరో సరికొత్త అధ్యాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నాంది పలికారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితిని.. జాతీయ పార్టీగా మారుస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
దేశ రాజకీయాల్లో మరో సరికొత్త అధ్యాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నాంది పలికారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితిని.. జాతీయ పార్టీగా మారుస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పార్టీ సర్వసభ్య సమావేశంలో సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితి పేరు మారింది. దసరా పర్వదినం రోజున జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశంతోపాటు.. సీఎం కేసీఆర్ పార్టీ ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా గులాబీ పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ రాష్ట్ర పోస్టర్లు, హోర్డింగులు అన్ని ప్రాంతాల్లో వెలుస్తున్నాయి.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోనూ భారత్ రాష్ట్ర సమితి హోర్డింగులు వెలిశాయి. విజయవాడలోని వారధి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్ పేరిట వారధి సెంటర్ వద్ద భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. జాతీయ పార్టీ ప్రకటిస్తున్న జయహో కేసీఆర్ అంటూ హోర్డింగ్‌పై.. కీసీఆర్, కేటీఆర్ చిత్రాలను ముద్రించారు. వారధి సెంటర్‌తో పాటు నగరంలోని వేర్వేరు చోట్ల పోస్టర్లు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. కాగా.. ఏపీలోనూ సీఎం కేసీఆర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ హోర్డింగ్‌లు ఏర్పాటు కావడంపై వాహనదారులు, పాదచారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. దీంతోపాటు ఈ హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలాఉంటే.. ఏపీలో కూడా భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో సంక్రాంతికి భారీ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. BRSకు అక్కడ కూడా మంచి ఆదరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏపీ నాయకులతో కేసీఆర్ సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భారీ సభకు ప్రణాళికలు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి సైతం చెప్పడం మరింత ఆసక్తికరకరంగా మారింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..