Telangana: బర్రెలక్కకు రోజురోజుకూ పెరుగుతున్న ఫాలోయింగ్.. మద్దతుగా నిలిచిన మాజీ సీబీఐ డైరెక్టర్
బర్రెలక్క ఈ పేరు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా.. పెద్దగా వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హేమాహేమీలు రకరకాల పార్టీల నుంచి బరిలో దిగుతున్నారు. ఇదే క్రమంలో స్వతంత్ర అభ్యర్థులు కూడా రాజకీయ నాయకులను ఢీ కొట్టేందుకు ప్రచారంలో వేగం పెంచారు. నామినేషన్ మొదలు ప్రచారం వరకూ ఎక్కడా తగ్గడం లేదు.

బర్రెలక్క ఈ పేరు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా.. పెద్దగా వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హేమాహేమీలు రకరకాల పార్టీల నుంచి బరిలో దిగుతున్నారు. ఇదే క్రమంలో స్వతంత్ర అభ్యర్థులు కూడా రాజకీయ నాయకులను ఢీ కొట్టేందుకు ప్రచారంలో వేగం పెంచారు. నామినేషన్ మొదలు ప్రచారం వరకూ ఎక్కడా తగ్గడం లేదు. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బర్రెలక్క రంగంలో దిగారు. ఈమె పేరు శిరీష. సామాజిక మాధ్యమాల్లో మంచి ఆదరణ కలిగిన యువ మహిళ. ఇక్కడి వరకూ చూసేందుకు బాగానే ఉంది. అయితే నిన్న మన్నటి వరకూ ఒక పార్టీ నాయకులు అంటే మరొకరికి పడరేమో అని అనుకునేవాళ్ళు. కానీ తమకు ఎవరు అడ్డొచ్చినా అడ్డం తొలగించుకుంటాం అనే విధంగా మారిపోయాయి నేటి రాజకీయాలు. గెలుపు కోసం ఎంతటి నీచానికైనా ఒడిగడతారనేందుకు అద్దం పడుతోంది ఈ సంఘటన.
కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలం వెనచర్లలో ఈమె ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. శిరీషతో పాటూ ఆమె సోదరుడు కూడా ఉన్నాడు. ఇంటింటికి వెళ్లి నాకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని దుండగులు ఆమె సోదరుడిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన సామాన్యుల మొదలు సెలబ్రిటీల వరకూ అందరినీ ఆలోచింపజేసింది. అందుకే ఆమెకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. మన్న మాజీ మంత్రి ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటిస్తే.. నేడు సీబీఐ ఈడీగా పనిచేసి పదవీవిరమణ పొందిన జేడీ లక్ష్మీ నారాయణ స్పందించారు. శిరీష సోదరుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఎక్స్ వేదికగా (ట్విట్టర్) ఆమెకు, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించాలని తెలంగాణ డీజీపీ, ఎన్నికల కమిషన్, సీఈవో ను కోరుతూ ట్యాగ్ చేశారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి శిరీష @బర్రెలక్కకు, ఆమె సోదరుడిపై ఈరోజు జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకుని ఆమెకు, కుటుంబ సభ్యులకు తగిన భద్రత కల్పించాలి. @TelanganaDGP @ECISVEEP @CEO_Telangana
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) November 21, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




