National Herald Case: మరోసారి తెరపైకి నేషనల్ హెరాల్డ్ కేసు.. ఎన్నికల వేళ BRS చేతికి బలమైన అస్త్రం..

స్కాముల పార్టీ.. స్కీముల పార్టీ కావాలా.. అని కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గా బుల్లెట్లు సంధిస్తున్న బీఆర్‌ఎస్‌ చేతికి మరో అస్త్రం దొరికింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ ఆస్తుల ఎటాచ్‌ అనే వార్త.. గులాబీ శ్రేణుల్లో జోష్‌ని పెంచేసింది. ఎవరి అవినీతి ఎంతో తేల్చుకుందాం రా.. అంటూ గురివింద సామెతల్ని గుర్తు చేస్తోంది కారు పార్టీ. కాంగ్రెస్ వర్సెస్ కేసీఆర్.. ఈ ఎటాకింగ్ స్టయిల్ ఇకపై మారబోతోందా? తెలంగాణ దంగల్‌లో నేషనల్ హెరాల్డ్ తాలూకు ప్రకంపనలు ఎలా ఉండబోతున్నాయ్?

National Herald Case: మరోసారి తెరపైకి నేషనల్ హెరాల్డ్ కేసు.. ఎన్నికల వేళ BRS చేతికి బలమైన అస్త్రం..
Congress Brs
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 22, 2023 | 7:44 AM

Telangana Assembly Polls: ప్రచారపర్వంలో బీఆర్‌ఎస్-కాంగ్రెస్‌ల మధ్య వన్‌టువన్ వార్ నడుస్తోంది. అవినీతి సబ్జెక్టు మీద రెండు పార్టీలు ఒకరిమీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇదే సమయంలో.. సోనియా, రాహుల్‌కి ఈడీ షాక్ అంటూ వచ్చిన బ్రేకింగ్ న్యూస్… తెలంగాణ దంగల్‌లో కీలక పరిణామం. ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు.. నేషనల్‌ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఢిల్లీ, ముంబై, లక్నోలో 752 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ ఎటాచ్ చేసింది. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీకిది షాకింగ్ న్యూస్. ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌కి ఇదొక అందివచ్చిన అవకాశంగా పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

తమ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, కేసీఆర్ కుటుంబం ప్రజాధనాన్ని దోపిడీ చేస్తోందని పదేపదే ఆరోపిస్తూ దూసుకెళ్తున్న కాంగ్రెస్‌ని రివర్స్ ఎటాక్ చేసే ఛాన్స్ దక్కింది గులాబీ పార్టీకి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని స్కాంగ్రెస్ పార్టీ అంటూ.. గతంలో జరిగిన కుంభకోణాల్ని ప్రస్తావిస్తూ… 48 లక్షల కోట్లు దోచుకున్నారని లెక్కలు చెబుతూ.. ఎలక్షన్ యాడ్స్‌లో దుమ్మెత్తి పోస్తోంది బీఆర్‌ఎస్. దీన్ని సీరియస్‌గా తీసుకుని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రకటనల్లో తమ పార్టీని కించపరిచారని అభ్యంతరం చెబుతూ, బీఆర్ఎస్‌ తప్పుడు ప్రచారాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ ఈసీ దగ్గర పంచాయితీ పెట్టారు కాంగ్రెస్ నేత అభిషేక్‌ సింఘ్వీ. ఇదే సమయంలో నేషనల్ హెరాల్డ్ కేసు అప్‌డేట్ వచ్చి కేసీఆర్‌కి కొత్త బూస్ట్‌నిచ్చింది. ఇవాళ్టినుంచి ప్రజా ఆశీర్వాద సభల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఎటాకింగ్‌ స్టయిల్ మార్చి.. సౌండ్ పెంచినా పెంచుతారు గులాబీ బాస్.

కొన్ని దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో నలుగుతోంది నేషనల్ హెరాల్డ్ కేసు. నేషనల్ హెరాల్డ్ పత్రికకకు పబ్లిషింగ్ బాధ్యతలు నిర్వహించే AJL సంస్థకు.. సోనియా కుటుంబానికి చెందిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కి మధ్య లావాదేవీల్లో అక్రమాలు జరిగాయన్నది అభియోగం. యంగ్ ఇండియన్ సంస్థకు ప్రమోటర్లుగా ఉన్న సోనియా, రాహుల్ మీద 2012లో ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు సుబ్రమణ్య స్వామి. ఈ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్, ఖర్గేలను విచారించి స్టేట్‌మెంట్లు రికార్డు చేసింది ఈడీ. ఇప్పుడు సోనియా, రాహుల్‌ ఆస్తుల్ని ఎటాచ్ చేయడం తాజా పరిణామం.

నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో తరచూ పొలిటికల్‌గా కార్నర్ అవుతూ వస్తోంది గాంధీ ఫ్యామిలీ. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల వేళ.. బీఆర్‌ఎస్‌ను అవినీతి పార్టీ అని విమర్శిస్తున్న కాంగ్రెస్‌ నేతలు.. ఇవాళ్టినుంచి నోరు మెదిపే ఛాన్స్ లేకుండా పోయిందంటోంది బీఆర్‌ఎస్. గులాబీ పార్టీ నుంచి రివర్స్ కౌంటర్లు కూడా సిద్ధమయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..