బీఆర్‌ఎస్ కార్యాలయానికి వెళ్లి ఓట్లు అడిగిన కొండా సురేఖ
తాజాగా వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొండా సురేఖ ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి తను ఓటు వెయ్యాలని అక్కడి నాయకులను ఆమె కోరారు. ర్యాగింగ్ లెవల్ 100 శాతం అంటూ కాంగ్రెస్ ఫర్ తెలంగాణ తమ ట్విట్టర్ (ఎక్స్)లో వీడియో పోస్ట్ చేసింది.
ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు నేతలు వింత పద్దతుల్లో ఓట్లు అభ్యర్థించడం చర్చనీయాంశమవుతూ ఉంటుంది. మరికొందరి ప్రచార శైలే విభిన్నంగా ఉంటుంది. తాజాగా వరంగల్ తూర్పు ప్రచారంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిని కొండా సురేఖ బీఆర్‌ఎస్ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తనకు ఓటు వేయాలంటూ అక్కడ ఉన్న స్థానిక బీఆర్‌ఎస్ నేతలకు విజ్ఞప్తి చేశారు. సురేఖ తీరుతో ఇరు పార్టీల కార్యకర్తలు విస్తుపోయారు. ప్రజంట్ అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
రిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
Latest Videos