Telangana: అందుకే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చా.. ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు – Watch Video
Telangana Election News: బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చేందుకు దారితీసిన పరిస్థితులపై బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్.. తనను లెఫ్ట్ హ్యాండ్ అన్నారు.. రైడ్ హ్యాండ్ అన్నారు. తీరా సొంతవాళ్లకు అడ్డొస్తున్నానని పార్టీ నుంచి తరిమేశారని చెప్పారు. తాను ఎవరికీ అడ్డుకాదని చెప్పినా.. తనను పార్టీ నుంచి బయటకు పంపారని అన్నారు.
Telangana Polls 2023: బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చేందుకు దారితీసిన పరిస్థితులపై బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్.. తనను లెఫ్ట్ హ్యాండ్ అన్నారు.. రైడ్ హ్యాండ్ అన్నారు. తీరా సొంతవాళ్లకు అడ్డొస్తున్నానని పార్టీ నుంచి తరిమేశారని చెప్పారు. తాను ఎవరికీ అడ్డుకాదని చెప్పినా.. తనను పార్టీ నుంచి బయటకు పంపారని అన్నారు. వార్డుమెంబర్‌గా గెలవలేనని బీఆర్‌ఎస్ పెద్దలు హేళన చేశారని అన్నారు. రోషంతో రాజీనామా చేసి బయటికి వచ్చి గెలిచిచూపించానన్నారు. తద్వారా తాను ఎవరిని ఫొటోతో గెలిచానని చూపించానని మెదక్ ఎన్నికల ప్రచారంలో ఈటల వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ టికెట్‌పై ఈటల రాజేందర్ పోటీ చేసి గెలుపొందడం తెలిసిందే. ఈ ఎన్నికల్లో హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేందుకు దారితీసిన పరిస్థితులపై ఈటల చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబరు 30న పోలింగ్ నిర్వహించి, డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.