Big News Big Debate: తెలంగాణలో గెలిపించే నినాదమెంటి? ప్రజల ఓటు ఎటు వైపు.. లైవ్ వీడియో

Big News Big Debate: తెలంగాణలో గెలిపించే నినాదమెంటి? ప్రజల ఓటు ఎటు వైపు.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Nov 21, 2023 | 7:07 PM

తెలంగాణ ఎన్నికల్లో ప్రధానపార్టీలు ఎవరికి వారు 80 సీట్లు గ్యారెంటీ అంటున్నారు. భారీ విజయంతో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇక హిందుత్వ అజెండాతో దూసుకొస్తున్న బీజేపీ రామరాజ్యం స్థాపిస్తామంటోంది. ప్రజలను చీకట్లో ఉంచిన దిక్కుమాలిన రాజ్యాలు తెలంగాణకు అవసరం లేదని.. అభివృద్ది చేసే లౌకిక కేసీఆర్‌ రాజ్యమే అవసరమంటోంది బీఆర్ఎస్‌.

తెలంగాణ ఎన్నికల్లో ప్రధానపార్టీలు ఎవరికి వారు 80 సీట్లు గ్యారెంటీ అంటున్నారు. భారీ విజయంతో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇక హిందుత్వ అజెండాతో దూసుకొస్తున్న బీజేపీ రామరాజ్యం స్థాపిస్తామంటోంది. ప్రజలను చీకట్లో ఉంచిన దిక్కుమాలిన రాజ్యాలు తెలంగాణకు అవసరం లేదని.. అభివృద్ది చేసే లౌకిక కేసీఆర్‌ రాజ్యమే అవసరమంటోంది బీఆర్ఎస్‌. ఇంకా ప్రచారానికి వారం రోజుల సమయమే ఉంది.. మాటల్లో పదును పెరిగింది. విజయంపై ధీమా కనిపిస్తోంది. బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే ప్రచార క్షేత్రంగా స్పీడు పెంచారు. రేపోమాపో రంగంలో దిగుతున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. నిశ్శబ్ద ఓటు బలంగా ఉందని.. విజయం తమదేనని ధీమాగా చెబుతోంది కాషాయం పార్టీ. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు 12 శాతం మైనారిటీ ఓట్ల కోసం 80 శాతం హిందూ ఓట్లను మోసం చేస్తున్నాయని ఆరోపించారు బండి సంజయ్‌. బీజేపీకి పట్టం కట్టడానికి 80శాతం ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. హిందూ సమాజం కలిసికట్టుగా ఉండి రామరాజ్యం తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్నారు బండి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అల్-షిఫా ఆస్పత్రిలో బందీలు- వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ సైన్యం

రెండేళ్ల బాలిక అవయవదానం.. ఇద్దరికి పునర్జన్మ

CM KCR: ప్రజల దగ్గర ఉండే ఓటు.. వజ్రాయుధం

Vizag: విశాఖ ఫిషింగ్‌ హార్బర్ ప్రమాదంలో అన్నీ అనుమానాలే

TOP 9 ET News: మరీ దారుణం..! | జాతరలో పుష్ప విశ్వరూపానికి అందరికీ గూస్ బంప్సే

Published on: Nov 21, 2023 07:07 PM