రెండేళ్ల బాలిక అవయవదానం.. ఇద్దరికి పునర్జన్మ

రెండేళ్ల బాలిక అవయవదానం.. ఇద్దరికి పునర్జన్మ

Phani CH

|

Updated on: Nov 20, 2023 | 9:18 PM

ఢిల్లీలో ఓ చిన్నారి తల్లిదండ్రులు పెద్దమనసు చాటుకున్నారు. ప్రమాదంలో బ్రెయిన్​ డెడ్ ​కు గురైన తమ రెండేళ్ల కుమార్తె శరీరంలోని అవయవాలను ఆపదలో ఉన్న వారికి దానం చేసేందుకు అంగీకరించారు. దీంతో ఇద్దరు పిల్లలకు వాటిని అమర్చడం వల్ల వారి ప్రాణాలు దక్కాయి. రెండేళ్ల దివ్యాన్షి మూడు అంతస్తుల బిల్డింగ్​పై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడింది. దీంతో ఆ చిన్నారిని ఢిల్లీలోని ఎయిమ్స్​ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఢిల్లీలో ఓ చిన్నారి తల్లిదండ్రులు పెద్దమనసు చాటుకున్నారు. ప్రమాదంలో బ్రెయిన్​ డెడ్ ​కు గురైన తమ రెండేళ్ల కుమార్తె శరీరంలోని అవయవాలను ఆపదలో ఉన్న వారికి దానం చేసేందుకు అంగీకరించారు. దీంతో ఇద్దరు పిల్లలకు వాటిని అమర్చడం వల్ల వారి ప్రాణాలు దక్కాయి. రెండేళ్ల దివ్యాన్షి మూడు అంతస్తుల బిల్డింగ్​పై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడింది. దీంతో ఆ చిన్నారిని ఢిల్లీలోని ఎయిమ్స్​ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే బ్రెయిన్​ డెడ్ కావడం వల్ల చిన్నారి మృతి చెందిందని​ డాక్టర్లు తెలిపారు. బాలిక శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా ఉండడం వల్ల వాటిని అవసరాల్లో ఉన్న వారికి దానం చేయాల్సిందిగా చిన్నారి తల్లిదండ్రులను డాక్టర్లు కోరారు. ఆర్గాన్ రిట్రీవల్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్‌ ద్వారా చిన్నారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్​ కూడా ఇప్పించారు వైద్యులు. ఈ కౌన్సిలింగ్​లో అవయవ దానం ప్రాముఖ్యత గురించి తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు.. చనిపోయిన తమ కుమార్తె అవయవాలను దానం చేసేందుకు ఒప్పుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM KCR: ప్రజల దగ్గర ఉండే ఓటు.. వజ్రాయుధం

Vizag: విశాఖ ఫిషింగ్‌ హార్బర్ ప్రమాదంలో అన్నీ అనుమానాలే

TOP 9 ET News: మరీ దారుణం..! | జాతరలో పుష్ప విశ్వరూపానికి అందరికీ గూస్ బంప్సే

కార్తీక సోమవారం.. ఇలా చేస్తే కోటి ఉపవాసాల ఫలం తిరుగులేని రాజయోగం, శివలోక ప్రాప్తి !!

Karthika Masam 2023: ఈ ఆరింటినీ ఆచరించేవారికి.. కార్తీకమాసంలో పరమశివుడి అనుగ్రహం