Watch Video: ఎయిర్‌పోర్ట్‌పై UFO కలకలం.. రెండు రఫేల్ జెట్స్ సాయంతో తీవ్ర గాలింపు
మణిపూర్‌లోని ఇంపాల్ ఎయిర్‌పోర్ట్‌పై ఆదివారం మధ్యాహ్నం కనిపించిన గుర్తు తెలియని ఆ వస్తువు(యూఎఫ్‌వో) ఏంటో నిగ్గు తేల్చేందుకు భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. దాని కోసం రెండు రఫేల్ జెట్ల సాయంతో ఇంపాల్ ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో తీవ్ర గాలింపు చేపట్టింది. అయితే ఎలాంటి యూఎఫ్‌వో కనిపించకపోవడంతో రెండు రఫేల్ జెట్లు వెనక్కి వచ్చినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
మణిపూర్‌లోని ఇంపాల్ ఎయిర్ పోర్ట్‌పై ఓ గుర్తు తెలియని ఎగిరే వస్తువు (UFO) కనిపించడం కలకలం సృష్టిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ప్రాంతంలో తెల్లని ఆకారంలో ఓ గుర్తు తెలియని వస్తువు విమానాశ్రయంపై దర్శనమిచ్చింది. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు.. మూడు గంటల పాటు ఆ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలను నిలిపివేశారు. గుర్తు తెలియని ఆ వస్తువు ఏంటో నిగ్గు తేల్చేందుకు భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. దాని కోసం రెండు రఫేల్ జెట్ల సాయంతో ఇంపాల్ ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో తీవ్ర గాలింపు చేపట్టింది. అయితే ఎలాంటి యూఎఫ్‌వో కనిపించకపోవడంతో రెండు రఫేల్ జెట్లు వెనక్కి వచ్చినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. గుర్తు తెలియని వస్తువు కనిపించడంతో ఇంపాల్ పరిసర ప్రాంతాలో రక్షణ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో అత్యంత ప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అటు గుర్తుతెలియని ఎగిరే వస్తువుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.