Viral: ఆ బడికంటె బర్రెల కొట్టమే బెటర్.! బీహార్ లో వింత స్కూల్.. వీడియో వైరల్.

Viral: ఆ బడికంటె బర్రెల కొట్టమే బెటర్.! బీహార్ లో వింత స్కూల్.. వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Nov 20, 2023 | 12:49 PM

షెడ్డు కింద న్యాల మీద కూసోని కాయిదాలు నింపుతుంది సూడూ.. ఈ పంతులమ్మ కొత్తగ కొల్వుల చేర్తందుకని బీహార్ పచ్చిమ చంపారన్ జిల్లా గోబర్హి అనే ఊరికి వొయ్యింది.. ఊల్లె ఇస్కూలేడ కానొస్తలేదేంది. .. అడుక్కుంట అడుక్కుంటవోతె.. బర్లకొట్టమసంటి గీ పందిరికింద కూసున్న ఇద్దర సార్లుండి.. ఆ.. రావమ్మ రా.. కొత్తగ టీచర్ కొల్వు కొట్టింది నువ్వేనా.. రా .. ఈ కాయిదాలు నింపి సంతుకాలు చేశి పో.. అన్జెప్పి కాయిదాలు చేతికిస్తె.. అయ్యో.. ఇదేంది సార్..

అయితె ఈ నడ్మ గా బీహార్ రాష్టంల ఇస్కూల్ టీచర్ల రిక్రూట్మెంట్ జరిగిందుల్లా.. ఇగ జాబులు సంపాయించినోల్లంత ఎక్కడ పోస్టింగిస్తె ఆ బడికివొయ్ షరీకైర్రు. ఇగట్లనే చంపారన్ జిల్లాలున్న ఒక బల్లె జాయినైతందుకని ఒక పంతులమ్మ వోతె.. ఆడ బడి లేదట.. బర్లకొట్టం ఉందటనుల్లా.. సూద్దాంపార్రి.. షెడ్డు కింద న్యాల మీద కూసోని కాయిదాలు నింపుతుంది సూడూ.. ఈ పంతులమ్మ కొత్తగ కొల్వుల చేర్తందుకని బీహార్ పచ్చిమ చంపారన్ జిల్లా గోబర్హి అనే ఊరికి వొయ్యింది.. ఊల్లె ఇస్కూలేడ కానొస్తలేదేంది. .. అడుక్కుంట అడుక్కుంటవోతె.. బర్లకొట్టమసంటి గీ పందిరికింద కూసున్న ఇద్దర సార్లుండి.. ఆ.. రావమ్మ రా.. కొత్తగ టీచర్ కొల్వు కొట్టింది నువ్వేనా.. రా .. ఈ కాయిదాలు నింపి సంతుకాలు చేశి పో.. అన్జెప్పి కాయిదాలు చేతికిస్తె.. అయ్యో.. ఇదేంది సార్.. ఇస్కూలేది.. బేంచీలేవి పిల్లలేరి అని అడిగితె.. కిస్సకిస్స నవ్విర్రట.. ఎంత అమాయకురాలవి బుజ్జీ.. స్కూల్ల చేరి సద్వులు చెప్పేద్దామనే.. దా సంతకాలువెట్టి సక్కగ మర్రి సూడకుంట ఇంటికివొ.. నెల కాంగనె నీ జీతం ఇంటికొస్తది.. అన్నట్టే మాట్లాడిర్రట నవ్వుకుంట.. పాపం.. ఇస్కూల్లకు వోంగనె పిల్లలంత పూలు సల్లి వెల్కం ముగ్గులేశి స్వాగతాలు చెప్తరేమొ అని ఎక్స్ పెక్ట్ చేస్తె.. ఇట్లయిందట కథ.. అంటె బీహారంతట ఇట్లనే ఉందని కాదుగనీ.. ఓ ఐదు వేల మీద సర్కార్ స్కూల్ల కథయితె ఇంతేనట.. స్కూల్ బిల్డింగులుండయ్.. ఉంటె బేంచీలుండయ్.. అన్నుంటె శెప్పే సార్లు.. టీచర్లుండరట..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.