Vizag: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో అన్నీ అనుమానాలే
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 40 కి పైగా ఫిషింగ్‌బోట్లు దగ్ధమయ్యాయి. రాత్రి 11 గంటల సమయంలో జట్టీలో మంటలు రేగాయి. ఆ మంటలు క్షణాల్లోనే ఇతర బోట్లకు వ్యాపించాయి. ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు రేగడంతో మత్స్యకారులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అందుబాటులో ఉన్న అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నించాయి.
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 40 కి పైగా ఫిషింగ్‌బోట్లు దగ్ధమయ్యాయి. రాత్రి 11 గంటల సమయంలో జట్టీలో మంటలు రేగాయి. ఆ మంటలు క్షణాల్లోనే ఇతర బోట్లకు వ్యాపించాయి. ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు రేగడంతో మత్స్యకారులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అందుబాటులో ఉన్న అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నించాయి. అయితే సముద్ర గాలులకు మంటలు మరింతగా రేగి పక్కనున్న బోట్లకు విస్తరించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం మత్స్యకారులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగిందని బాధితులు బోరుమంటున్నారు. వందబోట్లను మంటల నుంచి కాపాడుకున్నారు మత్స్యకారులు. లేదంటే వందలకోట్ల ఆస్తినష్టం జరిగేదని చెబుతున్నారు. ఒక్కో బోటు సుమారు 60 లక్షల రూపాయలు ఉంటుంది. అప్పులు తెచ్చుకుని బోట్లు కొనుక్కున్నామని.. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: మరీ దారుణం..! | జాతరలో పుష్ప విశ్వరూపానికి అందరికీ గూస్ బంప్సే
కార్తీక సోమవారం.. ఇలా చేస్తే కోటి ఉపవాసాల ఫలం తిరుగులేని రాజయోగం, శివలోక ప్రాప్తి !!
Karthika Masam 2023: ఈ ఆరింటినీ ఆచరించేవారికి.. కార్తీకమాసంలో పరమశివుడి అనుగ్రహం
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

