Etela Rajender: నమ్మి మీ వెన్నంటే వచ్చాం.. ఇప్పుడు మా పరిస్థితి ఏంటీ ఈటలా..?
Etela Rajender: ఆ నాయకుడిని నమ్ముకుని అధికార టీఆర్‌ఎస్ పార్టీని (TRS) వాళ్లు వదిలేసి వచ్చారు. ఎన్నో ఒత్తిళ్లను అధిగమించి... నమ్మిన నేత వెన్నంటే నిలిచారు. ఇప్పుడు నమ్ముకున్న నేత సైలెంట్ అయ్యారు. చేర్చుకున్న పార్టీ పట్టించుకోవడం లేదు. అసలు సైలెంట్ అయినా నేత ఎవరు ?
Etela Rajender: ఆ నాయకుడిని నమ్ముకుని అధికార టీఆర్‌ఎస్ పార్టీని (TRS) వాళ్లు వదిలేసి వచ్చారు. ఎన్నో ఒత్తిళ్లను అధిగమించి… నమ్మిన నేత వెన్నంటే నిలిచారు. ఇప్పుడు నమ్ముకున్న నేత సైలెంట్ అయ్యారు. చేర్చుకున్న పార్టీ పట్టించుకోవడం లేదు. అసలు సైలెంట్ అయినా నేత ఎవరు ? ఆయనను నమ్ముకుని వచ్చిన వారి భవిష్యత్ ఏంటీ.? లాంటి ఆసక్తికర కథనం మీకోసం..
ఈటల రాజేందర్ (Etela Rajender).. మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి భర్తరఫ్ అయిన తర్వాత ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. బీజేపీలో చేరి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈటల రాజేందర్‌కు పార్టీ అధిష్టానం వద్ద మంచి గుర్తింపే ఉంది. నిర్మల్ సభలో అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల ముచ్చింతల్ వచ్చిన మోడీ… ఎయిర్ పోర్ట్‌లో ఈటలను దగ్గరకు తీసుకుని మాట్లాడారు. అయితే ఈటల రాజేందర్ వెన్నంటే నడిచి… కాషాయ కండువా కప్పుకున్న నేతల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. పార్టీ పట్టించుకోవడం లేదని మనోవేదనకు గురవుతున్నారు. ఈటల రాజేందర్ వెనకాల వచ్చిన వారిలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమా, ఆర్టీసీ యూనియన్ మాజీ నేత అశ్వథామరెడ్డి తదితరులు ఉన్నారు. ఈటల రాజేందర్ గెలుపు కోసం హుజురాబాద్‌లో కష్టపడి పనిచేశారు.
ఈటల రాజేందర్ వెంట వచ్చిన ఈ నేతలకు పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఎలా ముందుకు వెళ్లాలో అర్ధంకాక నమ్ముకున్న నేతను ఫాలో అవుతున్నారు. ఈటల రాజేందర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ… వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీపై పూర్తిస్థాయిలో పట్టు ఇంకా సాధించలేకపోవడంతో సైలెంట్‌గా తనపని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక ఈటలను నమ్ముకున్న నేతలు ఏం చేయాలో తెలియక ఆయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికైనా పార్టీ గుర్తించి తమకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేయడానికి సిద్దంగా ఉన్నామని ఈటల వర్గీయులు చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీలలో బలమైన నేతలను బీజేపీ వైపు తిప్పడానికి ఈటల సిద్దంగా ఉన్నా… రాష్ట్ర పార్టీ నేతల నుంచి సానుకూల స్పందన లభించడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో సైతం బలమైన ప్రభుత్వాన్ని ఢీ కొట్టి గెలిచిన ఈటల రాజేందర్… బీజేపీలో తన ప్రభావాన్ని ఎలా పెంచుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read: Yami Gautam: లైంగిక వేధింపులు… హాట్‌టాపిక్‌గా హీరోయిన్ మాటలు.. వైరల్ అవుతున్న వీడియో..