AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ – ఏపీలో సేమ్ పొలిటికల్ సీన్.. తొడలుకొట్టి మీసాలు మెలేస్తున్న లీడర్స్.. అప్పుడే ఎందుకీ దూకుడు?

AP- Telangana Politics: ఉత్తరాదిలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ(BJP) విజయ ఢంకా మోగించింది. ఒక్క పంజాబ్‌లో మాత్రమే అధికారం ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) వశమయ్యింది. 

తెలంగాణ - ఏపీలో సేమ్ పొలిటికల్ సీన్.. తొడలుకొట్టి మీసాలు మెలేస్తున్న లీడర్స్.. అప్పుడే ఎందుకీ దూకుడు?
TRS vs BJP vs YSRCP
Janardhan Veluru
|

Updated on: Mar 12, 2022 | 12:16 PM

Share

AP- Telangana Politics: ఉత్తరాదిలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ(BJP) విజయ ఢంకా మోగించింది. ఒక్క పంజాబ్‌లో మాత్రమే అధికారం ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) వశమయ్యింది.  2024లో జరిగే ఫైనల్స్(సార్వత్రిక ఎన్నికలు)లోనూ ఈ 2022 సెమీ ఫైనల్ ఫలితాలను రిపీట్ చేస్తామని కమలనాథులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అటు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే ఊపు కొనసాగిస్తామంటూ కాలర్ ఎగరేస్తున్నారు.  ఆ రకంగా 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం, ప్రతిపక్షాలపై సైకలాజికల్‌గా పైచేయి సాధించే ఎత్తుగడలకు బీజేపీ నేతలు శ్రీకారంచుట్టేశారు. మొత్తానికి నాలుగు రాష్ట్రాల్లో కమలం వికసించిన ఫలితం.. ఇప్పుడు దక్షిణాదిలో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇటు తెలంగాణ.. అటు ఆంధ్ర ప్రదేశ్ రెండు చోట్లూ బీజేపీ నేతలు కొత్త ఉత్సాహంతో ఊగిపోతున్నారు. తెలంగాణ, ఏపీలో వచ్చే ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని బీజేపీ నేతలు తొడలు కొడుతుంటే.. ఇక్కడ మీకు అంత సీన్ లేదంటూ అధికార టీఆర్ఎస్, వైసీపీ నేతలు మీసం మెలేస్తున్నారు. మొత్తానికి ఫలితాలు వెలువడిన రెండు రోజుల్లోనే తెలంగాణ, ఏపీలో సేమ్ పొలిటికల్ సీన్ కనిపిస్తోంది.

బీజేపీ ఎంపీ జీవీఎల్ అయితే ఓ అడుగు ముందుకేసి.. 2024 ఎన్నికల నాటికి ఏపీలో అన్ని పార్టీలు ఖాళీ అయిపోతాయని జోస్యం చెప్పారు.  టీడీపీ, వైసీపీ తేడా లేదు.. లాస్ట్ కి కాంగ్రెస్‌లో మిగిలిన కొందరు లీడర్లు కూడా కమలం గూటికొచ్చేస్తారని ఆయన బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అంతే కాదు టచ్ చేసి చూడు అంటూ ఈ ప్రొగ్రాంకి తాము నామకరణం కూడా చేశామంటూ.. కామెంట్లు చేస్తుంటే.. ఇక్కడ అధికార పార్టీల నుంచి కౌంటర్లు స్టార్టయ్యాయి.

జీవీఎల్ కామెంట్స్‌పై వైసీపీ నేతలు ఒంటి కాలిపై లేస్తున్నారు. ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదంటున్నారు. ఒక్కసారి వైసీపీ అధినేత జగన్ కానీ అనుకుంటే.. మీ కమలం పార్టీ టోటల్ క్లోజ్ అవుతుందని మంత్రి వెల్లంపల్లి హెచ్చరించారు. ఏపీలో బీజేపీకి భవిష్యత్తు అనేది అత్యాశగా ఎద్దేవా చేశారు. ఈ విషయంలో బీజేపీ నేతలు పగటి కలలు కనొద్దని హితవుపలికారు. జీవీఎల్‌కి దమ్ము ధైర్యముంటే 2024లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆయన సవాల్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి జీవీఎల్ సత్తా చూపించాలన్నారు. సుజనా చౌదరి లేదా సీఎం రమేష్ లేదా  సోమువీర్రాజులు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ సత్తా చూపించాలని సవాల్ చేశారు.

మొత్తానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత సమ్మర్ హీట్‌తో పోటీపడుతూ తెలంగాణ, ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటు బీజేపీ నేతలు.. అటు అధికార పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటూ ఎన్నికల ప్రచార ఘట్టాన్ని తలపిస్తున్నారు. ఆ రకంగా సైకలాజికల్‌గా ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఇప్పుడే లేవుగా మరెందుకు లీడర్లు ఇలా చొక్కాలు చించుకుంటూ రెచ్చిపోతున్నారంటూ సామాన్యులు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇప్పుడే నేతలు ఇలా దూకుడు ప్రదర్శిస్తే.. ముందు ముందు వ్యవహారం ఏ స్థాయికి వెళ్తుందోనని చర్చించుకుంటున్నారు.

Also Read..

YSR Party Anniversary: మూడు దశాబ్ధాలు జగన్మోహన్ రెడ్డే సీఎం.. ఏపీ మంత్రి ఆదిమూలపు వ్యాఖ్యలు

Etela Rajender: నమ్మి మీ వెన్నంటే వచ్చాం.. ఇప్పుడు మా పరిస్థితి ఏంటీ ఈటలా..?