KTR: కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్.. ఇష్టానుసారం వ్యవహరిస్తే ‘పవర్ కట్ చేస్తాం’..
KTR: కేంద్రంలోనే బీజేపీ పార్టీ (BJP)పై టీఆర్‌ఎస్ (TRS) నాయకుల మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ధాన్యం కొనుగోలు విషయంలో మొదలైన ఈ మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ (KTR) మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు...
KTR: కేంద్రంలోనే బీజేపీ పార్టీ (BJP)పై టీఆర్‌ఎస్ (TRS) నాయకుల మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ధాన్యం కొనుగోలు విషయంలో మొదలైన ఈ మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ (KTR) మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వేదికగా కంటోన్మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. హైదరాబాద్ నాలా అభివృద్ధిపై అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తామని తేల్చి చెప్పారు కేటీఆర్. ఈ సందర్భంగా కంటోన్మెంట్‌కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.
ఈ విషయమై కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కంటోన్మెంట్ ఏరియాలో నాలాలపై చెక్‌డ్యామ్‌లు కట్టడం వల్ల కాలనీలు మునిగిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా అక్కడి అధికారులు తీరు మార్చుకోవడం లేదు. ఇకపై చూస్తూ ఊరుకోం.. ప్రజల కోసం తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వస్తే కంటోన్మెంట్‌కు నీళ్లు, కరెంటు కట్ చేస్తామ’ని కేటీఆర్ హెచ్చరించారు.
ఇక అధికారులతో ఆఖరిసారి చర్చలు జరపాలనీ.. వినకపోతే నీళ్లు, కరెంట్ కట్ చేయాలనీ.. అసెంబ్లీలోనే ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి ఆదేశాలిచ్చారు మంత్రి కేటీఆర్. గతంలో చాలాసార్లు కంటోన్మెంట్ ఇష్యూపై మాట్లాడిన కేటీఆర్.. ఇప్పుడు ఈ స్థాయిలో వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేపుతోంది. కంటోన్మెంట్ అంటే హైదరాబాద్‌తో కలిసిమెలిసి ఉండాలని.. ఇలా ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోబోమనీ స్పష్టం చేశారు కేటీఆర్.
Also Read: Andhra Pradesh: మత్స్యకారులకు వలకి చిక్కిన అరుదైన చేప.. ధర ఎంత పలికిందో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
PUNJ’AAP’: పంజాబ్‌లో ఆప్ ప్రభంజనం.. కేజ్రీవాల్ పార్టీకి కలిసొచ్చిన ఆరు కీలక అంశాలివే..