AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamilisai Soundararajan: సీఎం కేసీఆర్ సంపూర్ణారోగ్యంతో ఉండాలి.. పుష్పగుచ్ఛం, లేఖ పంపిన గవర్నర్‌ తమిళిసై

CM KCR Health: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన హైదరాబాద్‌లోని

Tamilisai Soundararajan: సీఎం కేసీఆర్ సంపూర్ణారోగ్యంతో ఉండాలి.. పుష్పగుచ్ఛం, లేఖ పంపిన గవర్నర్‌ తమిళిసై
TS Governor Tamilisai Soundararajan, CM KCR
Shaik Madar Saheb
|

Updated on: Mar 12, 2022 | 4:54 PM

Share

CM KCR Health: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. స్వల్ప అనారోగ్యంతో సీఎం కేసీఆర్ ఆసుపత్రికి వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గవర్నర్.. సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం, లేఖ పంపించారు. సీఎం కేసీఆర్ సంపూర్ణారోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్‌ పేర్కొన్నారు. అస్వస్థతతో కేసీఆర్‌ నిన్న ఆస్పత్రికి వెళ్లారని తెలిసి ఆందోళన చెందాన చెందినట్లు గవర్నర్ తెలిపారు.

కేసీఆర్‌ శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో పాటు ఎడమచేయి, కాలు నొప్పిగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పరీక్షలు చేయించుకున్నారు. అన్ని ఫలితాలు సాధారణంగా వచ్చాయని, కేసీఆర్‌ ఆరోగ్యం బాగుందని వైద్యులు ప్రకటించారు. ఆయనకు వారం రోజులపాటు విశ్రాంతి అవసరమని ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read:

జీహెచ్ఎంసీ అధికారులపై పోలీసులకు 11 ఏళ్ల బాలిక ఫిర్యాదు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Sniper Wali: ఒకే ఒక్కడు.. రష్యాకు సుస్సు పోయిస్తున్నాడు.. వచ్చీ రావడంతోనే ఊచకోత..