Andhra Pradesh: మత్స్యకారులకు వలకి చిక్కిన అరుదైన చేప.. ధర ఎంత పలికిందో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో కచ్చిడి చేప బాగా పాపులర్ అయింది. అందుకు మెయిన్ రీజన్ దాని ధర. ఈ రకం చేప మత్స్యకారులకు అరుదైగా చిక్కుతుంది. ధర అయితే ఏకంగా లక్షల్లోనే ఉంటుంది.

Andhra Pradesh: మత్స్యకారులకు వలకి చిక్కిన అరుదైన చేప.. ధర ఎంత పలికిందో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
Kachidi Fish
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 12, 2022 | 12:02 PM

Rajahmundry:  ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో కచ్చిడి చేప బాగా పాపులర్ అయింది. అందుకు మెయిన్ రీజన్ దాని ధర. ఈ రకం చేప మత్స్యకారులకు అరుదైగా చిక్కుతుంది. ధర అయితే ఏకంగా లక్షల్లోనే ఉంటుంది. ఆడ చేప కన్నా మగ చేప అయితేనే మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ ఉంటుందని చేపల వ్యాపారులు చెబుతారు. ఈ చేప పొట్టలోని తిత్తులు మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తారట.  సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తో తయారు చేస్తారని మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. ఖరీదైన వైన్‌ తయారీలోనూ ఈ ఫిష్‌ శరీర భాగాలను వినియోగిస్తుంటడంతో..  డిమాండ్ మరింత పెరిగింది. దీనిని గోల్డెన్ ఫిష్(Golden Fish) అనే పేరుతో కూడా పిలుస్తారు. నిజంగానే ఈ చేప దొరికితే మత్స్యకారులు తమకు బంగారం దొరికనట్టే అని భావిస్తారు.

తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ లో వేటకు వెళ్లిన మత్స్యకారులకు 26 కిలోల కచ్చిడి చేప చిక్కింది. దీనిని  అమ్మకానికి పెట్టగా.. పాలకొల్లు వ్యాపారులు 79వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఆపై ఈ చేపను కోల్‌కతాలోని ఓ ఫిష్ ఎక్స్‌పోర్ట్‌ సెంటర్‌కి లక్షన్నరకు విక్రయించాడు. అక్కడి నుంచి ఈ చేపను చైనాకు ఎగుమతి చేస్తారని వ్యాపారి తెలిపాడు. చూశారుగా ఎంత ధర పలికిందో. ఇలాంటి చేప ఒక్కటి వలలో చిక్కినా తమ పంట పండినట్టే అని మత్స్యకారులు చెబుతుంటారు. కాగా ఈ చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదు. ఒక చోట నుంచి మరో చోటికి ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటుంది. అందుకే వలకు చిక్కడం అరుదు.

Also Read:Andhra Pradesh: వంట నూనె విషయంలో ఇలా మోసం చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త