YSR Party Anniversary: మూడు దశాబ్ధాలు జగన్మోహన్ రెడ్డే సీఎం.. ఏపీ మంత్రి ఆదిమూలపు వ్యాఖ్యలు
YSR Party Anniversary: దివంగత మహానేత పాదాల చెంత 11 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతి కుటుంబ పెద్ద కొడుకుగా మారింది. వైఎస్సార్(YSR) ఆశయాల సాధన ధ్యేయంగా ఆవిర్భవించిన యువజన..
YSR Party Anniversary: దివంగత మహానేత పాదాల చెంత 11 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతి కుటుంబ పెద్ద కొడుకుగా మారింది. వైఎస్సార్(YSR) ఆశయాల సాధన ధ్యేయంగా ఆవిర్భవించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేడు 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని.. 12 వ వసంతం(Anniversary)లోకి అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో తాడేపల్లి(Tadepalli)లోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, కార్యకర్తలతో పండగ వాతావరణాన్ని తలపించింది. పార్టీ జెండా అవిస్కరించిన అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala ramarkishna reddy), మంత్రులు ఆదిమూలపు సురేష్(adimulapu Suresh), ధర్మాన కృష్ణదాస్ ,రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఆదిమాలుపు సురేష్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆదిమూలపు సురేష్: ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. పేద బడుగు బలహీనవర్గాల గుండెల్లో నుంచి వచ్చిందే వైఎస్సార్ సీపీ పార్టీ అని చెప్పారు. పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని అన్నారు. అంతేకాదు 3 దశాబ్దాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని సురేష్ ధీమా వ్యక్తం చేశారు.
ధర్మాన కృష్ణదాస్ : అందరి గురుంచి ఆలోచించే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. పదవులు పంపకంలో అందరికి న్యాయం జరుగుతుందని చెప్పారు.
నందమూరి లక్ష్మీపార్వతి : 40 ఏళ్ల ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి చావుదెబ్బ కొట్టారని నందమూరి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఏపీలో మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నని కొనియాడారు.
Also Read: