Delhi Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 60 పూరిగుడిసెలకు మంటలు.. ఏడుగురు మృతి

Fire Accident: దేశ రాజధాని ఢిల్లీ(Delhi )లో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. గోకుల్‌పురి(Gokalpuri)లోని గుడిసెలలో (jhuggis) చెలరేగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరికొందరికి కాలిన గాయాలు అయ్యాయి..

Delhi Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 60 పూరిగుడిసెలకు మంటలు.. ఏడుగురు మృతి
Delhi Fire Accident
Follow us
Surya Kala

|

Updated on: Mar 12, 2022 | 10:39 AM

Fire Accident: దేశ రాజధాని ఢిల్లీ(Delhi )లో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. గోకుల్‌పురి(Gokalpuri)లోని గుడిసెలలో (jhuggis) చెలరేగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరికొందరికి కాలిన గాయాలు అయ్యాయి. దాదాపు 60 గుడిసెలకు మంటలు అంటుకున్నాయని.. అర్ధరాత్రి 1 గంటలకు కాల్ వచ్చిందని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ తెలిపింది. సమాచారం అందిన వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మాటలను అదుపు చేయడానికి సుమారు నాలుగు గంటలపాటు శ్రమించింది. అదుపులోకి తెచ్చేందుకు మొత్తం 13 అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించారు.

గోకుల్ పురిలో విషాదం:  “గోకుల్‌పురి పీఎస్ ప్రాంతంలో తెల్లవారుజామున 1 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. శివార్లలోని గుడిసెల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి నిద్ర సమయం కావడంతో ప్రాణ నష్టం ఆస్తినష్టం భారీగా సంభవించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న  అగ్నిమాపక సిబ్బంది , రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.  తెల్లవారుజామున 4 గంటలకు మంటలను అదుపులోకి తీసుకుని వచ్చాయి. ఈ అగ్నిప్రమాదంలో మొత్తం 30 గుడిసెలు దగ్ధం కాగా.. పాక్షికంగా మరో 30 గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో  7 మంది ప్రాణాలు కోల్పోయారు అని ఈశాన్య ఢిల్లీ అదనపు డీసీపీ  చెప్పారు. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికి తీసింది. చిన్నారులు, ఇంకా ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నారు. అగ్ని ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వివరించారు.

Also Read: 

Nagendra Babu: తగ్గేదే లే అంటున్న మెగా హీరో.. కొడుక్కి గట్టిపోటీ అంటున్న మెగా ఫ్యాన్స్.. ట్రెండ్ అవుతున్న నాగబాబు ఫొటోస్..

Anatapuram: కాటమరాయుడి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ.. రేపు లక్ష్మీనరసింహుని కళ్యాణం.. భారీగా ఏర్పాట్లు