Anatapuram: కాటమరాయుడి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ.. రేపు లక్ష్మీనరసింహుని కళ్యాణం.. భారీగా ఏర్పాట్లు
Anatapuram: అనంతపురంజిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కదిరి(Kadiri). ఈ క్షేత్రంలో కొలువుదీరిన లక్ష్మీనరసింహస్వామి(Lakshmi Narasimha Swami) బ్రహ్మోత్సవాలు(Bhrahmotsavas) అంగరంగ వైభవంగా..
Anatapuram: అనంతపురంజిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కదిరి(Kadiri). ఈ క్షేత్రంలో కొలువుదీరిన లక్ష్మీనరసింహస్వామి(Lakshmi Narasimha Swami) బ్రహ్మోత్సవాలు(Bhrahmotsavas) అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. నేడు “అంకురార్పణ” తో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నిత్య వైభవంతో కళకళలాడే ఈ క్షేత్రంలో నేటి నుంచి పదిహేను రోజుల పాటు అంటే మార్చి 26వ తేదీ వరకూ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఈ వార్షిక బ్రహ్మోత్సవాలతో కదిరి క్షేత్రం భక్తులతో కిటకిటలాడనుంది. జై నారసింహ ధ్వానాలతో మార్మోగనుంది.
ఆదివారం ప్రధాన ఘట్టం స్వామివారి “కల్యాణోత్సవం” వేడుక నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణాన్ని కన్నులారా వీక్షించడానికి లక్షలాదిమంది భక్తులు హాజరుకానున్నారు.
ఈ నెల 23న స్వామివారి “బ్రహ్మరథోత్సవం” (తేరు) వేడుకను నిర్వహించనున్నారు. ఈ నెల 26న “పుష్పయాగోత్సవం” వేడుకతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇప్పటికే కరోనా నిబంధనలను అనుసరిస్తూ.. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కదిరిలో కొలువైన లక్ష్మీనరసింహ స్వామిని కాటమరాయుడుగా, కదిరి నరసింహుడుగా పిలవబడుతున్నాడు. భక్తుల చేత వసంత వల్లభుడిగా, ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహుడిగా పూజలు అందుకుంటున్నాడు.
Also Read:
Jyotish Tips: భగవంతుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఈ తప్పులు చేయవద్దు.. పాటించాల్సిన నియమాలు ఏమిటంటే..