Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రికులకు శుభవార్త.. ఏకంగా 20 వేల మందికి సరిపడా..

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పింది జమ్మూకశ్మీర్ ప్రభుత్వం. దక్షిణ కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ ధామ్ వార్షిక తీర్థయాత్రకు

Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రికులకు శుభవార్త.. ఏకంగా 20 వేల మందికి సరిపడా..
Amarnath
Follow us

|

Updated on: Mar 13, 2022 | 6:00 AM

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు శుభవార్త చెప్పింది జమ్మూకశ్మీర్ ప్రభుత్వం. దక్షిణ కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ ధామ్ వార్షిక తీర్థయాత్రకు హాజరయ్యే భక్తుల కోసం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 20 వేల మంది సామర్థ్యంతో యాత్రి నివాస్‌ను నిర్మిస్తోంది. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. 2020 – 2021 సంవత్సరాల్లో కోవిడ్-19 కారణంగా భక్తుల రాకపై ఆంక్షలు విధించారు. అయితే, ప్రస్తుతం కరోనా ప్రభుత్వం గణనీయంగా తగ్గడంతో.. దర్శనాలు, భక్తుల రాకపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.

శ్రావణ మాసంలో (జులై – ఆగస్టు) అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తాజాగా అక్కడి అధికారులు సమీక్ష చేపట్టారు. భక్తుల రద్దీ పెరుగనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై చర్చించారు. అలాగే, ఈ సమీక్షా సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అమర్‌నాథ్ క్షేత్రంలో రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగించాలని నిర్ణయించారు. ఒకేసారి 20 వేల మంది బస చేసేందుకు వీలుగా భవనాన్ని నిర్మించాలని పాలనా యంత్రాంగం నిర్ణయించింది. రాంబన్ జిల్లాలోని చందర్‌కోట్‌లో అమర్‌నాథ్ క్షేత్రం బోర్డు ద్వారా మూడు వేల పడకల యాత్రి నివాస్‌ను నిర్మించామని తెలిపారు అధికారులు. అలాగే, యాత్రికుల భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందింపుచ్చుకుంటున్నామన్నారు. ఈసారి వాహనాలు, ప్రయాణికుల కదలికలను గుర్తించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌(ఆర్ఎఫ్‌డీ)ని ఉపయోగించాలని బోర్డు నిర్ణయించింది.

ఇకపోతే.. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం తగ్గిపోవడంతో అమర్‌నాథ్ యాత్ర 2022 కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. జిల్లా స్థాయిలో ఈ యాత్రకు సంబంధించి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు అధికారులు. దేశం నుంచే కాక ప్రపంచ నలు మూలల నుంచి అమర్‌నాథ్ క్షేత్రానికి భక్తులు రానున్న నేపథ్యంలో ప్రయాణికుల కోసం హాల్టింగ్ స్థలాలను విస్తరించే పనిలో పడ్డారు అధికారులు. కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ.. భక్తుల సౌకర్యార్థం వైద్యుల సేవలను కూడా తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సాధారణంగా.. అమర్‌నాథ్ యాత్ర జూన్ చివరిలో లేదా జులై మొదటి వారంలో ప్రారంభమవుతుంది. అయితే, అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు తరఫున ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి.. ఆ తరువాత యాత్రను ఖరారు చేస్తారు.

ఆధునిక స్టాప్ఓవర్ సైట్‌ల నిర్మాణం.. అమర్‌నాథ్‌ యాత్రలో మౌలిక వసతులు పెంచడంతో పాటు హాల్టింగ్‌ స్థలాల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు అధికారులు. అమర్‌నాథ్ యాత్రికుల కోసం శ్రీనగర్‌లో 2800, రాంబన్‌లోని చంద్రకోట్‌లో 3200, జమ్మూలోని మాజిన్‌లో 3000 మంది యాత్రికుల సామర్థ్యంతో ఆధునిక హాల్టింగ్‌లను నిర్మిస్తున్నారు.

Also read:

Health Tips: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

Telangana: అసెంబ్లీలో నవ్వులే నవ్వులు.. భట్టి విక్రమార్క కామెడీకి పడి పడి నవ్విన మంత్రి కేటీఆర్..

Andhra Pradesh: ఏపీలో షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగా ట్రైన్ కింద పడ్డ యువకుడు.. హడలెత్తిస్తున్న దృశ్యాలు..!