AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగా ట్రైన్ కింద పడ్డ యువకుడు.. హడలెత్తిస్తున్న దృశ్యాలు..!

Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య సంచలనం రేపుతుంది. అందరూ చూస్తుండగానే..

Andhra Pradesh: ఏపీలో షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగా ట్రైన్ కింద పడ్డ యువకుడు.. హడలెత్తిస్తున్న దృశ్యాలు..!
Train
Shiva Prajapati
|

Updated on: Mar 12, 2022 | 7:28 PM

Share

Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య సంచలనం రేపుతుంది. అందరూ చూస్తుండగానే రైలుకిందకు దూకి క్షణాల్లో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన తునిలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి రైల్వే అధికారులు, సీసీటీవీ ఫుటేజీ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తుని రైల్వే స్టేషన్‌లోని ఒకటవ నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఓ యువకుడు నిల్చున్నాడు. అటూ ఇటూ సరదాగా తిరుగుతున్నాడు. ఇంతలో రెండవ నెంబర్ ప్లాట్‌ఫామ్ మీదుగా రైలు హారన్ వేస్తూ వస్తోంది. దాన్ని గమనించిన యువకుడు.. చకచరకా ఒకవ నెంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి కిందకు దిగి రైలు పట్టాలు దాటుడై.. రెండవ నెంబర్ ప్లాట్‌ఫామ్ సైడ్ రైలు పట్టాలు మీదుగా వస్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా దూసుకుపోయాడు. అకస్మాత్తుగా రైలు కింద పడిపోయాడు. ఈ ఘటనలో యువకుడు స్పాట్ డెడ్ అయ్యాడు. కాగా, ఈ దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ సీన్‌ను ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు.. కాసేపటి వరకు షాక్‌లోనే ఉండిపోయారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు.. యువకుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా పోలీసులు పేర్కొన్నారు. మృతుడి వివరాలను రైల్వే పోలీసులు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరచినట్లు ఎస్సై మారూప్ తెలిపారు.

Also read:

Sabja Seeds Benefits: సబ్జా గింజలతో అద్భుత ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

Viral Video: ఇరగదిద్దామనుకున్నాడు.. కాళ్లు విరగొట్టుకున్నాడు.. వైరల్ అయిన వీడియో..

Skin Care Tips: గంధంతో చర్మ సమస్యలకు చెక్.. ఇలా వాడితే ముఖంపై మొటిమలు మాయం..