Skin Care Tips: గంధంతో చర్మ సమస్యలకు చెక్.. ఇలా వాడితే ముఖంపై మొటిమలు మాయం..
చాలా మంది చర్మ సమస్యలతో ఇబ్బందిపడడం కామన్. సీజన్స్ మారుతున్న ప్రతిసారి చర్మ సమస్యలు వేధిస్తుంటారు. మొటిమలు.. మచ్చలు.
చాలా మంది చర్మ సమస్యలతో (Skin Care) ఇబ్బందిపడడం కామన్. సీజన్స్ మారుతున్న ప్రతిసారి చర్మ సమస్యలు వేధిస్తుంటారు. మొటిమలు.. మచ్చలు.. చర్మం ఎర్రబడడం వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బందిపెడుతుంటాయి. ముఖ్యంగా మొటిమల సమస్య ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మొటిమలు.. వాటి తాలుకూ మచ్చలతో ముఖం అందవికారంగా తయారవుతుంది. వీటిని తగ్గించుకోవడానికి అనేక రకాల కెమికల్ ప్రొడక్ట్స్.. ఇంటి నివారణలు ట్రై చేస్తుంటారు. కానీ ఫలితం మాత్రం తక్కువగానే ఉంటుంది. ఇక ఈ మొటిమల సమస్య తీవ్రంగా ఉన్నవారు వైద్యుల సూచనలతో చికిత్స కూడా తీసుకుంటారు. కానీ.. కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మొటిమల సమస్యను తగ్గించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందామా.
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని కొబ్బరి నూనెను మొటిమల మీద రాసి ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన మొటిమలు తగ్గుతాయి. కొబ్బరి నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది మొటిమలను తగ్గించడమే కాకుండా.. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మచ్చలను తొలగిస్తుంది.
మొటిమలు.. మచ్చలు ఎక్కువగా ఉన్నవారు ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించడం వలన చాలా ప్రయోజనం ఉంటుంది. ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ రెండు చెంచాల తేనే, కొంచెం నీరు మిక్స్ చేసి కాటన్ సహాయంతో మొటిమలపై అప్లై చేయాలి. పది పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా రోజూ చేస్తే మొటిమల సమస్య తగ్గుతుంది.
విటమిన్ ఈ క్యాప్సూల్స్ మార్కెట్లో సులభంగా లభిస్తాయి. వాటి లోపల ఉండే లిక్విడ్‌ను మొటిమలపై అప్లై చేయాలి. విటమిన్ ఇ కోసం బాదం నూనెను కూడా ఉపయోగించవచ్చు.
ఉల్లిపాయ రసాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసి ముఖంపై మొటిమలు ఉన్న చోట రాసి ఆరిన తర్వాత కడిగేయాలి. ఉల్లిపాయలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. మొటిమల మీద ఉల్లిపాయ రసాన్ని అప్లై చేయడం వలన మొటిమలు తగ్గుతాయి.
శనగపిండిలో పెరుగును కలిపి ముఖానికి పట్టించాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేస్తే మచ్చలు.. మొటిమలు తగ్గుతాయి. వేప ఆకులను నీళ్లతో గ్రైండ్ చేసి పెస్ట్ గా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. వేపలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఈ వేప పేస్ట్ వలన మొటిమలు.. మచ్చలు తగ్గుతాయి.
గంధం పొడిలో అర టీస్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి మొటిమలపై అప్లై చేయాలి. కాసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వలన మొటిమలు.. మచ్చలు తగ్గుతాయి. అంతేకాకుండా.. గంధం పొడిలో నిమ్మరసం, పెరుగు కలిపి ముఖంపై అప్లై చేస్తే మొటిమలు తగ్గుతాయి.
Radhe Shyam: రాధేశ్యామ్ సినిమాపై మీమ్స్‌తో ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన తమన్..
Anchor Anasuya: మీవల్లే స్ట్రాంగ్‌గా నిలబడ్డాను.. మీరే నా ఆర్మీ.. యాంకర్ అనసూయ ఆసక్తికర కామెంట్స్..