Anchor Anasuya: మీవల్లే స్ట్రాంగ్‏గా నిలబడ్డాను.. మీరే నా ఆర్మీ.. యాంకర్ అనసూయ ఆసక్తికర కామెంట్స్..

యాంకర్ అనసూయ (Anchor Anasuya).. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటుందో తెలిసిన విషయమే. ఎప్పుడూ ఫోటోషూట్స్..

Anchor Anasuya: మీవల్లే స్ట్రాంగ్‏గా నిలబడ్డాను.. మీరే నా ఆర్మీ.. యాంకర్ అనసూయ ఆసక్తికర కామెంట్స్..
Anchor
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 12, 2022 | 2:43 PM

యాంకర్ అనసూయ (Anchor Anasuya).. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటుందో తెలిసిన విషయమే. ఎప్పుడూ ఫోటోషూట్స్.. సినిమా అప్డేట్స్.. ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట్లో తెగా హాడావిడి చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఎంతో సందడి చేసే అనసూయకు ట్రోల్స్ కూడా కొత్తేమి కాదు.. ఆమె షేర్ చేసే ప్రతి చిన్న కామెంట్ నుంచి ఫోటోస్.. సినిమాలోని పాత్రల వరకు ఇలా అన్నింటిపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తుంటారు. ఇటీవల ఉమెన్స్ డే రోజున నెట్టింట్లో అనసూయ చేసిన రచ్చ గురించి తెలిసిందే. నెటిజన్స్ చేసే కామెంట్లకు ఎప్పటికప్పుడు తనదైన స్టైల్లో గట్టిగానే సమాధానాలు చెబుతుంటుంది.

అయితే అనసూయపై దారుణంగా కామెంట్స్ చేసేవాళ్లున్నా.. మరోవైపు ఆమెకు అభిమానులు కూడా ఎక్కువే ఉన్నారు. తనపై జరుగుతున్న ట్రోలింగ్ కంటే.. తనకు మద్ధతునిస్తూ కామెంట్స్ చేస్తున్న వారి గురించి ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వచ్చింది.. తనను వాళ్లు అర్థం చేసుకున్నారని.. దీంతో తాను చేసేది కరెక్టేనని అనిపిస్తోందంటూ చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి తన ఫ్యాన్స్ గురించి చెప్పుకొచ్చింది. తన పేరుతో ఉన్న ఫ్యాన్స్ పేజీలపై అనసూయ ప్రేమ కురిపించింది.

Anasuya

Anasuya

నా ఫ్యాన్ పేజీలను నడిపించే వారందరికీ థ్యాంక్స్.. ఎంతో జెన్యూన్ గా.. బాధ్యతగా వ్యవహరిస్తున్నందుకు థ్యాంక్స్. మీరు ఎప్పుడు కూడా వేరేవారికి ఇబ్బంది కలిగించలేదు… మీరే ఓ నిర్ణయానికి రాలేదు.. నిజాన్ని చెప్పడానికే ప్రయత్నించారు. నా మీద ఎలాంటి అభిప్రాయాలను రుద్దకుండా.. నా మీద ప్రేమ కురిపిస్తూనే ఉన్నారు.. మీరెప్పుడు తప్పుడు సమాచారాన్ని ఇవ్వలేదు.. ఎవరితోనూ పోల్చకుండా నన్ను నన్నుగా ప్రోత్సాహించారు. మీవల్లే నేను ఇలా స్ట్రాంగ్ గా నిలబడి ఉన్నాను.. మీరే నా ఆర్మీ.. అంటూ చెప్పుకొచ్చింది అనసూయ.

Also Read: Samantha And Varun Dhawan: సామ్‌కు ఎస్కార్టులా మారిపోయిన బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో.. ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌..

Jacqueline Fernandez: చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న వయ్యారాలు వలకబోస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..

Anasuya Bharadwaj: బుల్లితెర అయిన వెండితెరకు అయిన తగ్గని అందాల ‘అనసూయ’ జోరు..(ఫొటోస్)

BellamKonda Suresh: చీటింగ్‌ కేసుపై స్పందించిన బెల్లంకొండ సురేష్‌.. ఇదంతా ఓ రాజకీయ నాయకుడి కుట్రేనంటూ..