AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha And Varun Dhawan: సామ్‌కు ఎస్కార్టులా మారిపోయిన బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో.. ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌..

ఫ్యామిలీ మ్యాన్‌-2 వెబ్‌ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఇందులో రాజీ అనే ఎల్‌టీటీఈ రెబెల్‌ పాత్రలో అద్భుత నటనను కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Samantha And Varun Dhawan: సామ్‌కు ఎస్కార్టులా మారిపోయిన బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో.. ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌..
Samantha And Varun Dhawan
Basha Shek
|

Updated on: Mar 12, 2022 | 2:26 PM

Share

ఫ్యామిలీ మ్యాన్‌-2 వెబ్‌ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఇందులో రాజీ అనే ఎల్‌టీటీఈ రెబెల్‌ పాత్రలో అద్భుత నటనను కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సిరీస్‌ కూడా సూపర్‌ హిట్‌ కావడంతో సామ్‌ కు బాలీవుడ్‌లోనూ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ను తెరకెక్కించిన రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలోనే మరో వెబ్‌సిరీస్‌కు పచ్చ జెండా ఊపింది. స్పై థ్రిల్లర్‌ యాక్షన్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో వ‌రుణ్ ధావ‌న్ హీరోగా న‌టిస్తున్నారు. బాలీవుడ్ యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించి ప్రి ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. కాగా సిరీస్‌కు సంబంధిచిన చర్చల కోసం ముంబై అంధేరీలోని రాజ్‌ అండ్‌ డీకే నివాసంలో శుక్రవారం సమావేశం జరిగింది. దర్శక నిర్మాతలతో పాటు హీరోయిన్‌ సమంత, హీరో వరుణ్‌ధావన్‌లు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. కాగా సమావేశం అయిపోయిన తరువాత సమంత బయటకు వెళ్లిపోతున్న సందర్భంలో అభిమానులు, ఫొటో జర్నలిస్టులు అంతా ఆమె చుట్టూ చేరారు. ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో సమంత భయపడిపోయింది.

ఆమెకు ఎందుకు భయపెడుతున్నారు?

ఇదే సమయంలో అక్కడకు వచ్చిన వరుణ్‌ ధావన్‌ సామ్‌ కు రక్షణగా నిలబడ్డాడు. ఫ్యాన్స్‌ను, జర్నలిస్టుల ను పక్కకు వెళ్లమంటూ సముదాయించాడు. హేయ్..హేయ్.. జరగండి..జరగండి. ఎందుకు ఆమెను అలా భయపెడుతున్నారు? భయపెట్టకండి ఆమెను’ అంటూ రిక్వెస్ట్‌ చేశాడు. అనంతరం సామ్‌ను సేఫ్‌గా కారు వ‌ర‌కు వరుణ్ తీసుకెళ్లారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈక్రమంలో సామ్‌ కు బాడీగార్డులా మారిన వరుణ్‌ ధావన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతను రీల్‌ హీరోలా మాత్రమే కాదు రియల్ హరోగా బిహేవ్ చేశాడంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక వెబ్‌ సిరీస్‌ విషయానికొస్తే.. మార్వెల్‌ సినిమాల రూపకర్తలు రూసో బ్రదర్స్‌ హాలీవుడ్ లో ‘సిటాడెల్’ పేరుతో ఓ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ప్రియాంక ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమాకు ఇండియన్‌ వెర్షన్‌ నే వెబ్ సిరీస్‌గా రాజ్‌ అండ్‌ డీకే రూపొందిస్తున్నారు.

Also Read:Kurnool: భూమా కుటుంబంలో మరింత చిచ్చుపెట్టిన విగ్రహావిష్కరణ.. ఆళ్లగడ్డలో ఉద్రిక్తత..

సితార ఫొటోస్ చూసి మూవీస్ కి ఎంట్రీ అంటున్న నెటిజన్లు..

West Godavari: ఉషోదయపు వేళలో.. మంచు బిందువుల కోసం రామచిలుకల సందడి