AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool: భూమా కుటుంబంలో మరింత చిచ్చుపెట్టిన విగ్రహావిష్కరణ.. ఆళ్లగడ్డలో ఉద్రిక్తత..

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబీకుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా మాజీ మంత్రి భూమా నాగిరెడ్డి  విగ్రహావిష్కరణ ఈ వివాదాలకు మరింత ఆజ్యం పోసింది.

Kurnool: భూమా కుటుంబంలో మరింత చిచ్చుపెట్టిన విగ్రహావిష్కరణ.. ఆళ్లగడ్డలో ఉద్రిక్తత..
Bhuma Family
Basha Shek
|

Updated on: Mar 12, 2022 | 2:21 PM

Share

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబీకుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా మాజీ మంత్రి భూమా నాగిరెడ్డి  విగ్రహావిష్కరణ ఈ వివాదాలకు మరింత ఆజ్యం పోసింది. వివరాల్లోకి వెళితే.. నేడు (మార్చి12) దివంగత మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వర్ధంతి. ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా కిషోర్ రెడ్డి.. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ల విగ్రహాలను ఆళ్లగడ్డ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు .ఇందులో భాగంగా సొంత ఖర్చుతోనే విగ్రహాలను ఏర్పాటు చేశాడు. ఈరోజు విగ్రహాలను ఆవిష్కరించేందుకు పూర్తి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇందుకోసం భూమా నాగిరెడ్డికి సన్నిహితులైన ఏవీ సుబ్బారెడ్డి , భూమా నాగిరెడ్డి అభిమానులు, కార్యకర్తలు, బంధువులను ఆహ్వానించారు. అయితే విభేదాల కారణంగా భూమా నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియను ఆహ్వానించలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన అఖిలప్రియ విగ్రహాల దగ్గరికి వెళ్లి భర్త భార్గవ్ రామ్, తమ్ముడు జగత్ తో కలిసి ఆవిష్కరించడం సంచలనంగా మారింది.

అఖిలప్రియ వర్సెస్ భూమా కిశోర్..

కాగా భూమానాగి రెడ్డి , శోభా నాగిరెడ్డి మృతితో కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అఖిల ప్రియ టీడీపీలో ఉండగా మిగతా కుటుంబీకులు బీజేపీలో ఉన్నారు. భూమా కిషోర్ రెడ్డి బీజేపీ ఆళ్లగడ్డ ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. మరికొందరు బంధువులు వైసీపీలో ఉన్నారు. ఈ సందర్భంలో అఖిల ప్రియను ఒంటరి చేసేందుకు కుటుంబీకులు బంధువులు ఏకమైనట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే భూమా అఖిలప్రియ వ్యతిరేకులు అందరిని ఏకతాటిపైకి తెచ్చేందుకు భూమా కిషోర్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఏవీసుబ్బారెడ్డి, భూమా నారాయణ్‌ రెడ్డి, భూమా వీరభద్రారెడ్డి ఇతరులను కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. వీరంతా కూడా భూమా అఖిలప్రియ కు వ్యతిరేకంగా ఉన్నారు. భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో ఉన్నప్పటికీ తన బంధు వర్గం ద్వారా కుటుంబీకులను ఏకతాటి పైకి తేవడం ద్వారా ఆళ్లగడ్డ టీడీపీ టికెట్ సాధించాలనేది కిషోర్ రెడ్డి ఉద్దేశంగా ఉన్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. ఇక గత కొన్ని రోజులుగా భూమా అఖిలప్రియ కు కిషోర్ రెడ్డికి మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయి. భూమా కిషోర్ రెడ్డి కి చెందిన పొలం కాంపౌండ్ గోడను ఇటీవలే ధ్వంసం చేశారు అఖిల ప్రియ అనుచరులు.  దీనికి సంబంధించి కిషోర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ పై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ సందర్భంలోనే విగ్రహాల వివాదం విభేదాలకు ఆజ్యం పోసినట్లుగా చెప్పుకుంటున్నారు.

Also Read:IND vs SL, 2nd Test, Day 1, LIVE Score: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ XI ఎలా ఉందంటే?

KTR: కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చిన కేటీఆర్‌.. ఇష్టానుసారం వ్యవహరిస్తే ‘పవర్‌ కట్‌ చేస్తాం’..

Anasuya Bharadwaj: బుల్లితెర అయిన వెండితెరకు అయిన తగ్గని అందాల ‘అనసూయ’ జోరు..(ఫొటోస్)