West Godavari: ఉషోదయపు వేళలో.. మంచు బిందువుల కోసం రామచిలుకల సందడి
West Godavari: పచ్చని చిలుకలు(parrots) తోడుంటే... పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు.. ఈ లోకంలో కన్నీరు ఇంక చెల్లు.. ఓ సినీ కవి చెప్పాడు.. అవును ప్రకృతికి మానవ జీవితానికి విడదీయలేని..
West Godavari: పచ్చని చిలుకలు(parrots) తోడుంటే… పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు.. ఈ లోకంలో కన్నీరు ఇంక చెల్లు.. ఓ సినీ కవి చెప్పాడు.. అవును ప్రకృతికి మానవ జీవితానికి విడదీయలేని బంధం ఉంది. ప్రక్రృతిలో చెట్టు, పుట్ట, జీవం ఇలా ప్రతి దానికి ఓ అనుబంధం ఉంటుంది.
మంచుకురిసే వేళను , మల్లె విరిసే రేయిని ఆస్వాదించటం కేవలం మనుషులకు మాత్రమే కాదు…మొగలి పువ్వల పొదల్లో అనుభూతిని పంచుకునే సర్పాలు కాల్పనికత కాదని చెబుతుంటారు. ఇక ఉషోదయ వేళలో రెక్కలు విరిచి ఆకాశంలోకి పక్షులు రివ్వున ఎగురుచుంటే ఆ ద్రృశ్యాలు ప్రక్రృతి ప్రేమికులను కను విందు చేస్తాయి.
ప్రకృతి సోయగాలు నిలయం పచ్చని కొక కట్టిన పల్లె పడుచులా ప్రకృతి ప్రేమికులను అలరించే సోయగాలు గోదావరి జిల్లాల సొంతం.. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ అందమైన దృశ్యం చోటు చేసుకుంది. పచ్చని చేల దగ్గర అరటి తోటల దగ్గర అందమైన రామ చిలుకలు హల్ చల్ చేశాయి.
ఇక్కడ స్వచ్ఛమైన మంచు బిందువులు తాగేందుకు రామచిలుకలు పోటీ పడ్డాయి. పచ్చని పొలాల్లో, అరటి ఆకులమీద తేలి ఆడుతున్న నీటి చుక్కల కోసం చిలుకలు చేసిన సందడి అందర్నీ ఆకట్టుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొడేరు మండలం వేండ్రలో రామచిలుకలు ఈ సందడి చేసాయి.
Sajjala slams TDP: మాకు ముందస్తు ఎన్నికలు అవసరం లేదు.. అనవసర ప్రచారం వద్దు