Sajjala slams TDP: మాకు ముందస్తు ఎన్నికలు అవసరం లేదు.. అనవసర ప్రచారం వద్దు

Sajjala Ramakrishna Reddy: ఏపీ(Andhrapradesh)లో ముందస్తు ఎన్నికలంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ పార్టీ(YCP Party) ఆవిర్భావ వేడుకలలో పాల్గొన్న..

Sajjala slams TDP: మాకు ముందస్తు ఎన్నికలు అవసరం లేదు.. అనవసర ప్రచారం వద్దు
Sajjala Ramakrishna Reddy
Follow us
Surya Kala

|

Updated on: Mar 12, 2022 | 1:15 PM

Sajjala slams TDP: ఏపీ(Andhrapradesh)లో ముందస్తు ఎన్నికలంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ పార్టీ(YCP Party) ఆవిర్భావ వేడుకలలో పాల్గొన్న సజ్జల అనేక విషయాలపై స్పందించారు. ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ వైసీపీ అని చెప్పారు.  రాజకీయాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ వైసీపీ. అధికారం కోసమే కాదు ప్రజలకు సేవ చేయడానికే అని నిరూపించిన పార్టీ వైసీపీ అని చెప్పారు. అంతేకాదు నవరత్నాలతో సీఎం జగన్ వేసిన విత్తనాలకి చెట్లు, పండ్లు ఇప్పుడు కనిపిస్తున్నాయని.. మూడేళ్ళ క్రితం 9 కార్యక్రమాలతో మొదలుపెడితే ఈరోజు 90 కి పైగా కార్యక్రమాలు అయ్యాయని చెప్పారు.

సీఎం జగన్ గత మూడేళ్ళుగా సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తూ వచ్చారు. అన్ని వర్గాలకు రాజకీయ సాధికారత వచ్చేలా చేశారని చెప్పారు. మహిళలకు నిజమైన సాధికారత కల్పించేలా 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. జగన్ ఏపీలోని విద్యా వ్యవస్థ లో సమూల మార్పులు తీసుకువచ్చారని ఈ సందర్భంగా చెప్పారు. ప్రభుత్వ స్కూల్స్ లో సీట్లు కాళీ లేనంతగా నిండిపోయాయి. ప్రభుత్వ స్కూల్స్ లో సీటు కోసం ఎమ్మెల్యే ల సిపర్సు చేసే పరిస్థితి నెలకొందని చెప్పారు సజ్జల.

రాష్ట్రంలో టీటీడీని కుప్పంతో సహా అన్ని ప్రాంతాల్లో చెత్త బుట్టలో పడేసారు. అండమాన్ లో ఒక వార్డ్ గెలిస్తే సంబరాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీకి ఈసారి 160 సీట్లు వస్తాయి ప్రచారం చేసుకుంటున్నారు.. వారి ప్రచారాన్ని విని  ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీకి 160 సీట్లు అనడం కూడా అమరావతి గ్రాఫిక్ లాంటిదే…చంద్రబాబుకి తెలిసిన విద్య వెన్నుపోటు ఒక్కటే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు సజ్జల.

చంద్రబాబు చుట్టూ కూడా వెన్నుపోటు వారే ఉన్నారు..మొత్తం అందరూ కలిసి 2024 ఎన్నికలకు వచ్చే ప్లాన్ చేస్తున్నారు. అయితే టీడీపీ సినిమాకి 2024 లో శుభం కార్డు పడబోతుంది.. వైసీపీకి వీళ్ళేవరు ప్రత్యర్ధులు కారు.. వైసీపీ కార్యకర్తలు అంతా ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ  కుట్రలు ప్రజలకు చెప్పాలని సుచినారు. రాష్ట్రానికి అరిష్టం లా టీడీపీ తయారయ్యింది.. 2024 లో శాశ్వతంగా తుడిచెయ్యాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జులై లో వైసీపీ ప్లీనరీ జరుగుతుంది.. అంతకు ముందు జరగాల్సినవి అన్ని చేసుకోవాలని కార్యకర్తలకు, నేతలకు సూచించారు సజ్జల.

Also Read: Crore Rupees Fraud: రైతుల పేరుతో నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ పాస్ పుస్తకాలతో సొసైటీల్లో కోట్ల రూపాయల గోల్ మాల్..

BellamKonda Suresh: చీటింగ్‌ కేసుపై స్పందించిన బెల్లంకొండ సురేష్‌.. ఇదంతా ఓ రాజకీయ నాయకుడి కుట్రేనంటూ..

Viral Video: ల్యాప్ టాప్‌లో నిమగ్నమైన వ్యక్తి.. వెనుక విషపూరితమైన పులి పాము.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో వైరల్