Viral Video: ల్యాప్ టాప్‌లో నిమగ్నమైన వ్యక్తి.. వెనుక విషపూరితమైన పులి పాము.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో వైరల్

Viral Video: ఆస్ట్రేలియా(Australia)లో పాములు ఎక్కడబడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఆరుబటయ, ఇళ్లల్లో, మరుగుదొడ్ల లో, కారు టైర్లు, రైళ్లు ఇలా ఎక్కడబడితే అక్కడ పాములు కనిపించడం అక్కడ సర్వసాధారణం. ఈ..

Viral Video: ల్యాప్ టాప్‌లో నిమగ్నమైన వ్యక్తి.. వెనుక విషపూరితమైన పులి పాము.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో వైరల్
Camera Footage Shows Snake
Follow us

|

Updated on: Mar 12, 2022 | 12:39 PM

Viral Video: ఆస్ట్రేలియా(Australia)లో పాములు ఎక్కడబడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి.  ఆరుబటయ, ఇళ్లల్లో,  మరుగుదొడ్ల లో, కారు టైర్లు,  రైళ్లు ఇలా ఎక్కడబడితే అక్కడ పాములు కనిపించడం అక్కడ సర్వసాధారణం. ఈ నేపథ్యంలో ఒక పాము  గిప్స్‌ల్యాండ్‌(Gippsland) లోని ఒక వ్యక్తి ఇంట్లోకి చొరబడింది.  ఒక వ్యక్తి  ఆరు బయట తన డెక్‌పై కూర్చొని లాప్ టాప్(Laptop) లో  ఏదో పనిచేస్తూ.. ఫుల్ బిజీబిజీగా ఉన్నాడు. అదే సమయంలో లాన్ లోని గడ్డి లోనుంచి ఒక పాము మెల్లగా పాకుతూ అతని వద్దకు చేరుకుంటుంది.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మాల్కమ్ అనే వ్యక్తి  వ్యక్తి  ఆరు బయట కుర్చీలో కూర్చుని ల్యాప్ టాప్ ను చూస్తూ.. ఏదో పనిలో నిమగ్నమయ్యాడు. మధ్యలో ఒక సీసాలోని డ్రింక్ ను తాగుతూ.. రివాల్వింగ్ కుర్చీ లో రిలాక్స్ గా కూర్చున్నాడు. రివాల్వింగ్ కుర్చీ లో కాళ్ళను కదుపుతూ సడెన్ గా తన కాళ్ళను చైర్ కి కొంచెం పైన పెట్టుకున్నాడు. అదే సమయంలో పాము మెల్లగా పాకుతూ.. మాల్కమ్ కుర్చీ కిందకు చేరుకుంది.. అక్కడ కుర్చీ కాళ్లు పాము తగలడంతో.. అది భయటంతో వేగంగా అడ్డదిడ్డంగా పాకడం మొదలు పెట్టింది.. అదే సమయంలో మాల్కం కూడా పాముని చూసి భయంతో కుర్చీని అటుఇటు కదిపాడు.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సిసి కెమెరాల్లో రికార్డ్ అయింది.  మొదట ఈ వీడియో మాల్కమ్  రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. “2 వారాల క్రితం ఇంటి లోపల నా పాదాల మీదుగా పాము వెళ్ళింది అని కామెంట్ ను వీడియోకు జత చేశాడు.

ఈ వీడియోకి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. పాములు తో జాగ్రత్తగా ఉండాలి.. విషపూరితమైనవి అని ఒకరంటే.. మరొకరు.. నేను ఇలాంటి సంఘటన ఎప్పుడూ చూడనిది.. “విషపూరిత సరీసృపాలు మానవులకు చాలా ప్రమాదకరమైనవి. . ఒక్కసారి నాకు మొసలితో ఇలాంటి అనుభవమే ఎదురైంది అని వ్యాఖ్యానిస్తున్నారు.

View this post on Instagram

A post shared by ABC News (@abcnews)

ఆస్ట్రేలియన్ మ్యూజియం చెప్పిన ప్రకారం.. ఈ పులిపాము భూమిపై నివసించే అత్యంత విషపూరిత పాములలో ఇది ఒకటి. దీని విషం మనిషిపై అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది. శారీరక బలం లేని పులిపాము కాటువేసిన వెంటనే బాధితులు దాదాపు తక్షణమే చనిపోతారు. ఎక్కువమంది పక్షవాతం కారణంగా మరణిస్తారు,  కాటు వేసిన ప్రాంతంలో  తీవ్రమైన నొప్పిని అనుభవిస్తాడు.

Also Read:

Andhra Pradesh: మత్స్యకారులకు వలకి చిక్కిన అరుదైన చేప.. ధర ఎంత పలికిందో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

Poland: ఆ దేశ పౌరులు భారత దేశ మహారాజుని తండ్రిగా భావిస్తారు.. ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు ఎందుకంటే…

Coronavirus: మళ్లీ 4 వేలకు దిగొచ్చిన కరోనా కేసులు.. మరణాల్లోనూ భారీ తగ్గుదల.. దేశంలో ఎన్ని యాక్టివ్ కేసులున్నాయంటే..