Coronavirus: మళ్లీ 4 వేలకు దిగొచ్చిన కరోనా కేసులు.. మరణాల్లోనూ భారీ తగ్గుదల.. దేశంలో ఎన్ని యాక్టివ్ కేసులున్నాయంటే..
గత రెండున్నరేళ్లుగా ఏదో ఒక విధంగా మనల్ని ముప్పుతిప్పులు పెడుతోన్న కరోనా (Corona Virus) క్రమంగా అదుపులోకి వస్తోంది. మూడో వేవ్ అనంతరం రోజురోజుకి కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది.
గత రెండున్నరేళ్లుగా ఏదో ఒక విధంగా మనల్ని ముప్పుతిప్పులు పెడుతోన్న కరోనా (Corona Virus) క్రమంగా అదుపులోకి వస్తోంది. మూడో వేవ్ అనంతరం రోజురోజుకి కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. కొద్దిరోజులుగా కొత్త కేసులు 3 వేల నుంచి 5 వేల మధ్యలో నమోదవుతున్నాయి. అయితే మరణాల సంఖ్యలో మాత్రం హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ఇప్పుడు అవి కూడా అదుపులోకి వస్తున్నాయి. ముందురోజు 255గా ఉన్న మరణాలు.. తాజాగా 100 దిగువకు చేరాయి. ఈ మేరకు శనివారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ(Health Ministry) కరోనా బులెటిన్ ను విడుదల చేసింది. దీని ప్రకారం గడిచిన 24 గంటల్లో 8 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,614 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో దేశంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.29 కోట్లకు చేరింది. ఇక నిన్న మరో 89 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మీద 5.15 లక్షల మంది మరణించారు.
దిగొచ్చిన యాక్టివ్ కేసులు.. ఇక గడిచిన 24 గంటల్లో 5,185 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 4.24 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.71 శాతం ఉండగా.. రోజువారీ పాటివిటీ రేటు 0.44 శాతమని కేంద్ర వైద్య ఆరోగ్య ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగ దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 40,559గా ఉంది. ఇవి మొత్తం కేసుల్లో 0.09 శాతం మాత్రమే. ఇక కరోనా కేసులు అదుపులోనే ఉన్నా వ్యాక్సినేషన్ ప్రక్రియ మాత్రం చురుగ్గా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 18,18,511 మంది కొవిడ్ టీకాలు తీసుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 179 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
????? ?????https://t.co/7JbBtz9WeI pic.twitter.com/CsuLK9XL8H
— Ministry of Health (@MoHFW_INDIA) March 12, 2022
Telangana Assembly: ప్రారంభమైన అసెంబ్లీ… కీలకాంశాలపై మంత్రుల సమాధానాలు
Viral: దారికాశారు.. డబ్బుల సంచితో వెళ్తుండగా.. షాకింగ్ విజువల్స్