Viral: దారికాశారు.. డబ్బుల సంచితో వెళ్తుండగా.. షాకింగ్ విజువల్స్

హర్యానాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇసుక వ్యాపారిని నిలువు దోపిడీ చేశారు. సీసీ ఫుటేజ్‌లో రాబరీ దృశ్యాలు రికార్డయ్యాయి.

Viral: దారికాశారు.. డబ్బుల సంచితో వెళ్తుండగా.. షాకింగ్ విజువల్స్
Robbers
Follow us

|

Updated on: Mar 12, 2022 | 9:57 AM

డబ్బుల బ్యాగుతో ఇంటికి వెళ్తున్న వ్యాపారిని మంచి ప్లేస్‌ చూసి కొట్టారు దొంగలు. చీకటి పడింది. షాపు మూసేసి ఇంటికి ఒంటరిగా వెళ్తున్న ఇసుక వ్యాపారి అనీల్‌కుమార్‌ దారిదోపడీకి గురయ్యారు. హర్యానాలోని తోహనలో జరిగింది ఈ ఘటన. రోజు లాగానే క్యాష్‌ తీసుకొని రాతియా రోడ్డు మార్గంలో ఉన్న16వ వార్డులో ఉన్న తన ఇంటికి వెళ్తున్నారు. వ్యాపారి అనీల్‌ని ఫాలో అవుతూ వచ్చారు ఇద్దరు దుండగులు. బైక్‌పై వచ్చిన ఈ ఇద్దరు రాబర్స్‌.. సరిగ్గా రోడ్డుపై ఎవరూ కనిపించని ప్రదేశానికి చేరుకోవడం గమనించి బైక్ పైనుంచి దిగి వ్యాపారి అనీల్‌కుమార్‌ని పిస్టోల్ తో బెదిరించారు. చేతిలో ఉన్న క్యాష్ బ్యాగ్ ఇవ్వకపోతే చంపేస్తామంటూ భయపెట్టారు. బాధితుడు డబ్బుల బ్యాగు ఇచ్చేందుకు నిరాకరించడంతో చేతిలో ఉన్న బ్యాగును బలవంతంగా లాక్కొని వచ్చిన బైక్‌పైనే పారిపోయారు. తోహనాలో జరిగిన ఈ దారి దోపిడీ అక్కడ వీధిలో అమర్చిన CC కెమెరాలో రికార్డైంది. చేతిలో డబ్బులు పోగొట్టుకున్న బాధితుడు అనీల్‌కుమార్ వెంటనే పరుగులు పెడుతూ పోలీస్‌ స్టేషన్‌కి చేరుకుని కంప్లైంట్ ఇచ్చాడు. తనపై జరిగిన దాడి, దొంగలు ఎత్తుకెళ్లిన క్యాష్‌ బ్యాగ్‌తో సహా అన్నింటిని పోలీసులకు వివరంగా ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఇసుక వ్యాపారి కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దోపిడీ జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడి CC ఫుటేజ్‌ని సేకరించారు. అందులో దోపిడీ దొంగలు వ్యాపారిని అటాక్ చేసి క్యాష్ తీసుకెళ్లిన వీడియో పరిశీలించారు. బైక్‌ నెంబర్‌ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దారి దోపిడీ వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. నిందితుల్ని గుర్తించేందుకు పోలీసులే స్వయంగా కొన్ని సోషల్ మీడియా గ్రూప్‌లలో షేర్ చేస్తున్నారు.

Also Read: Viral: ఉత్త రంగురాళ్లేమో అనుకున్నారు.. ల్యాబ్‌కి పంపి టెస్ట్ చేయిస్తే మైండ్ బ్లాంక్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..