Viral: ఉత్త రంగురాళ్లేమో అనుకున్నారు.. ల్యాబ్‌కి పంపి టెస్ట్ చేయిస్తే మైండ్ బ్లాంక్
రంగురాళ్లు అని మోసం చేయబోయారు. కాని అవి వజ్రాలు. ఏంటీ, రివర్స్‌లో చెప్పామని షాక్ అవుతున్నారా... ఈ స్టోరీ చూస్తే అసలు మ్యాటర్ ఏంటో మీకే తెలుస్తుంది.
Chennai Airport: చెన్నై విమానాశ్రయంలో భారీగా వజ్రాలు సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు… ఎయిర్ కార్గోలో వజ్రాలు తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఇతర దేశాల నుంచి పార్సెల్ లో వచ్చిన ఖరీదైన రాళ్లను గుర్తించిన అధికారులు…వాటిని పరిశీలించిన తరువాత విలువైన వజ్రాలుగా గుర్తించారు. పట్టుబడ్డ వజ్రాల విలువ సుమారు నాలుగున్నర కోట్ల వరకు ఉంటుందని అంచనా . పార్సెల్ లో ఉన్న సమాచారం ఆధారంగా విచారణ చేపట్టారు అధికారులు. తొలుత వీటిని రంగురాళ్లుగా ప్రచారం చేశారు. రంగారాళ్లుగానే పార్శిల్‌లో పొందుపర్చారు. అక్కడు ఎయిర్‌కార్గోలో ఉన్న వివరాలను బట్టి విలువను చాలా తక్కువగా కోట్ చేశారు. కానీ కస్టమ్స్ అధికారులకు ఆ రంగురాళ్లను చూడగానే డౌట్ వచ్చింది. వెంటనే ల్యాబ్‌కు పంపారు. ప్రతీ రాయిని టెస్ట్ చేశారు. చివరకు ఇవి రంగురాళ్లు కాదని.. అసలు సిసలైన వజ్రాలని తేల్చారు. గతవారం మార్చ్ 5న వీటిని స్వాధీనం చేసుకున్న అధికారులు.. వారంపాటు శ్రమించి.. వీటిని వజ్రాలుగా తేల్చారు. బియ్యం నూక సైజు నుంచి పెద్ద రేగిపండు సైజ్ వరకు ఈ వజ్రాలున్నాయి. మొత్తం నాలుగున్నర కోట్ల రూపాయలు విలువచేస్తున్నట్లు తేలింది. అయితే ఈ వజ్రాలను ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనేది ఇంకా తేలలేదు. కేసు బుక్ చేశారు. సెండర్, రిసీవర్ అడ్రస్‌లకు నోటీసులు పంపారు.
Also Read: Viral Video: ఆస్కార్ రేంజ్‌లో యాక్టింగ్ చేసిన బాతు చివర్లో ట్విస్ట్ మాత్రం సూపర్..