AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: తల్లి కన్నుమూసిందని తెలియక.. 4 రోజులుగా పాఠశాలకు వెళుతూ.. తిరుపతిలో హృదయ విదారక ఘటన..

తిరుపతి విద్యానగర్‌ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మృతదేహంతోనే కుమారుడు నాలుగు రోజులు ఉండడం అక్కడి స్థానికుల్లో కలకలం రేపింది.

Tirupati: తల్లి కన్నుమూసిందని తెలియక.. 4 రోజులుగా పాఠశాలకు వెళుతూ.. తిరుపతిలో హృదయ విదారక ఘటన..
medico death
Basha Shek
|

Updated on: Mar 12, 2022 | 9:35 AM

Share

తిరుపతి విద్యానగర్‌ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మృతదేహంతోనే కుమారుడు నాలుగు రోజులు ఉండడం అక్కడి స్థానికుల్లో కలకలం రేపింది. తల్లి రాజ్యలక్ష్మి నిద్ర పోతోందని పదేళ్ల కుమారుడు శ్యామ్‌ కిషోర్‌ భావించడం వల్లనే ఇదంతా జరిగిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. కుటుంబ కలహాలతో రాజ్యలక్ష్మి భర్తకు దూరంగా కుమారుడితో కలిసి విద్యానగర్‌ కాలనీలో నివాసముంటోంది. నగరంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఆమె అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. కాగా ఈ నెల 8న ప్రమాదవశాత్తూ ఇంట్లో కిందపడిపోయి రాజ్యలక్ష్మి మృతిచెందారు. అయితే అమ్మ నిద్ర పోతోందని భావించిన శ్యామ్ కిషోర్‌ నాలుగు రోజులుగా పాఠశాలకు వెళ్లొస్తున్నాడు. ఇంట్లో ఉన్న తినుబండారాలతో నాలుగు రోజులు గడపడంతో పాటు మంచం పక్కన తల్లి మృతదేహంతోనే పడుకున్నాడు.

కాగా తల్లి మృతదేహం నుంచి దుర్వాసన వస్తోందని శ్యామ్ కిషోర్‌ తన మేనమామ దుర్గాప్రసాద్‌కు చెప్పాడు. దీంతో ఇంట్లో రాజ్యలక్ష్మి మృతదేహాన్ని చూసి అతను వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే శ్యామ్ కిషోర్ మానసిక స్థితి సరిగా లేదని, అందుకే ఇలా జరిగిందని దుర్గాప్రసాద్‌ చెబుతున్నాడు. Also Read:Pawan Kalyan : హరీష్ శంకర్ సినిమా కంటే ముందు పవర్ స్టార్ చేసే సినిమా అదేనా..?

Prabhas comments on marriage: పెళ్లిపై ప్రభాస్‌ షాకింగ్‌ కామెంట్స్.. అందుకే సింగిల్‌గా ఉన్నానంటున్న డార్లింగ్‌..!(వీడియో)

Kacha Badam Singer: ఆ పరిస్థితి వస్తే మళ్లీ పళ్లీలు అమ్ముతాను.. సెలబ్రిటీ కామెంట్లపై క్షమాపణలు చెప్పిన కచ్చాబాదమ్‌ సింగర్‌..