Pawan Kalyan : హరీష్ శంకర్ సినిమా కంటే ముందు పవర్ స్టార్ చేసే సినిమా అదేనా..?

ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అంటారే... ఆ సామెతే ఇప్పుడు పవర్‌స్టార్‌ లైనప్‌తో బాగా సింకవుతోంది.

Pawan Kalyan : హరీష్ శంకర్ సినిమా కంటే ముందు పవర్ స్టార్ చేసే సినిమా అదేనా..?
Bhavadeeyudu Bhagat Singh
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 12, 2022 | 9:10 AM

Pawan Kalyan : ప్రస్తుతం టాలీవుడ్ లో ఎప్పుడో ఒప్పుకున్న సినిమాల్ని పక్కకు పెట్టి… మిడిల్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రాజెక్టులే చకచకా పట్టాలెక్కిచేస్తున్నారు హీరోలు. పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌తో పాటు ఆయన సినిమా డైరెక్టర్లకు కూడా ఇదొక మిలియన్ డాలర్ల సందేహమే అవుతోందట. ఐడియా రావడం, ప్రొడక్షన్ మొదలుపెట్టడం, థియేటర్లో రిలీజవ్వడం… జస్ట్ ఏడాది స్పాన్‌లోనే జరిగిపోయిన సర్‌ప్రైజింగ్ మూవీ భీమ్లానాయక్. ఇంకో మాటలో చెప్పాలంటే.. ఇటువంటి ఇన్‌స్టంట్ ప్రాజెక్టులకే పవర్‌స్టార్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారట. మిగతా సినిమాల్ని అటుంచి.. ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ ప్రపోజల్స్‌నే చకచకా టేబుల్ మీదకెక్కిస్తున్నారట. ఇప్పుడు వినోదయ సిత్తం అనే వెబ్‌ ఫిలిమ్‌ని సినిమాగా మార్చి… అందులో పవర్‌స్టార్‌ని దేవుడిగా చూపెట్టబోతున్నారు త్రివిక్రమ్. ఇందులో మరో హీరోగా సాయిధరమ్‌ పేరును కన్సిడర్ చేస్తున్నారు. ఏప్రిల్‌లో షూటింగ్‌ మొదలవుతుందని, పవన్ ఇప్పటికే 20 రోజుల కాల్‌షీట్లు ఇచ్చేశారని టాక్. విజయ్‌ హీరోగా నటించిన తెరి అనే కోలీవుడ్ సక్సెస్‌ఫుల్ మూవీని కూడా పవర్‌స్టార్ కోసమే గురూజీ సీరియస్‌గా వర్కవుట్ చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా క్రిష్ మూవీ హరిహర వీరమల్లు కూడా పవన్‌ కోసం వెయిటింగ్‌లో వుంది. ఏఎం రత్నంకి లాంగ్‌లాంగ్ ఎగో పవన్‌ మాటిచ్చిన సినిమా ఇది.

ఈ కమిట్‌మెంట్స్ అన్నీ కంప్లీటైతే తప్ప భవదీయుడు భగత్‌సింగ్ పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. కొన్నిసార్లు కాలమే సమస్య..  కొన్నిసార్లు కాలమే సమాధానం అంటూ ట్విట్టర్‌లో డైరెక్టర్ హరీష్ లేటెస్ట్‌గా చెప్పిన హైకూ ఈ సినిమా తాలూకు సందేహాన్నే రిప్రజెంట్ చేస్తోంది. పవన్‌తో టచ్‌లోనే వున్నా.. టైమొచ్చినప్పుడు అన్నీ చెబుతా అంటూ భీమ్లా సెట్ ఫోటోని షేర్ చేసి.. అదే సస్పెన్స్‌ని మెయిన్‌టెయిన్ చేశారు హరీష్. సో.. భీమ్లానాయక్‌ భగత్‌సింగ్‌ గెటప్‌లోకి మారాలంటే ఇంకా ఎన్ని క్యాలెండర్లు మారాలో ఆ భవదీయుడికే తెలియాలి మరి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pooja Hegde: డిఫరెంట్ డ్రెస్సులతో పిచ్చెకిస్తున్న పూజ హెగ్డే.. చూస్తే వావ్ అనాల్సిందే

Surbhi: సరికొత్త లుక్ లో అందాల భామ సురభి… నెట్టింట ఫోటోస్ వైరల్

Radhe Shyam: రాధేశ్యామ్‌ స్లోగా ఉందన్న వారికి.. అదిరిపోయే పంచ్‌ ఇచ్చిన థమన్‌.. వైరల్‌ అవుతోన్న మీమ్‌..