AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: ఆర్ఆర్ఆర్‌ లవర్స్‌కి అదిరిపోయే వార్త.. ఇంత వరకు ఏ ఇండియన్‌ సినిమా సాధించని..

RRR: రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో, ఎన్టీర్‌ (NTR), రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోలుగా తెరకెక్కిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ ఈ చిత్రం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. కరోనా (Corona) కారణంగా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన..

RRR: ఆర్ఆర్ఆర్‌ లవర్స్‌కి అదిరిపోయే వార్త.. ఇంత వరకు ఏ ఇండియన్‌ సినిమా సాధించని..
Rrr Movie
Narender Vaitla
|

Updated on: Mar 12, 2022 | 8:46 AM

Share

RRR: రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో, ఎన్టీర్‌ (NTR), రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ ఈ చిత్రం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. కరోనా (Corona) కారణంగా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి. దేశంలోని దాదాపు అన్ని భాషలతోపాటు, ఇతర దేశాల్లోనూ విడుదలవుతుండడంతో ఓవర్‌సీస్‌లోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ మార్కెట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని అమెరికాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాలో ఆర్ఆర్‌ఆర్‌ సినిమాను విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూటర్‌ సరిగమ సినిమాస్‌ తాజాగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదలకు సంబంధించి ట్వీట్ చేస్తూ..’అమెరికాలో ఉన్న ఆడియన్స్‌ సిద్ధంగా ఉండండి. రేపు (ఆదివారం) మీకోసం సరిగమ సినిమాస్‌, రాఫ్తార్‌ క్రియేషన్స్‌ నుంచి ఎగ్జైట్‌మెంట్ ప్రకటన రానుంది. ఇది ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా అందుకోలేని అరుదైన విశేషం’ అంటూ రాసుకొచ్చారు. దీంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆసక్తి నెలకొంది. అమెరికాలో ఏ భారతీయ సినిమా సాధించని ఆ ఘనత ఏంటా అన్ని ఆలోచిస్తున్నారు. ఇంతకీ ఆ ఎగ్జైట్‌మెంట్ ఏంటో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను అంతే భారీగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఆలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సముద్రఖని, శ్రియా, అజయ్ దేవ్ గన్ ఇతర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Also Read: DRDO Recruitment: డీఆర్‌డీవీలో అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తులకు గడువు ఇంకా రెండు రోజులే..

Russia – Ukraine War: ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పాకిస్తాన్ యువతి.. ఎందుకోసమంటే..!

బాలీవుడ్‌లో కుక్కలను ఇష్టపడే తారలు వీరే..

Follow Us
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే